దిశా యాప్ తో భర్త భరతం పట్టిన భార్య

117
Wife Compaliants Against Husband As Disha App
Wife Compaliants Against Husband As Disha App
Wife Compaliants Against Husband As Disha App
ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ సత్ఫలితాలను ఇస్తుంది.  తాజాగా తన భర్త ఓ యువతిని వేధిస్తుండగా పోలీసులకు అప్పగించింది సదరు వ్యక్తికి సంబంధించిన భార్య . అతనిపై దిశ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ దారుణమైన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో వెలుగుచూసింది.తాడేపల్లికి చెందిన అనిల్ కుమార్ రైల్వేగార్డుగా పనిచేస్తూ తన భార్య, పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. ఇటీవలే అతని ఇంటి ముందుకు ఓ ఫ్యామిలీ అద్దెకు దిగింది. ఆ కుటుంబంలో ఓ యువతి విజయవాడలోని ఓ కాలేజీలో చదువుతుంది. ఆ యువతిపై కన్నేసిన అనిల్ కుమార్ ఎలాగైనా లొంగదీసుకోవాలనుకున్నాడు. ఓ రోజు విద్యార్థిని తన ఇంటి మీదుగా నడుచుకుంటూ వెళ్లగా గమనించిన అనిల్ నీ ఫొటోలు నా దగ్గర ఉన్నాయని బెదిరించాడు. ఖంగుతిన్న యువతి చూపించమని కోరగా ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. దాన్ని వీడియో తీసి.. తరుచూ బెదిరిస్తూ అత్యాచారానికి పాల్పడుతూ ఉండేవాడు. అలా ఓ రోజు యువతిని కాలేజీ నుంచి ఓ లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే గత కొద్ది రోజులుగా భర్త అనిల్ ప్రవర్తనలో మార్పులు గమనించిన భార్య, నిన్న అతడిని ఫాలో అయ్యింది. అదే సమయంలో ఆ విద్యార్థినిని భర్త బైక్ ఎక్కించుకోవడం చూసి దిశ యాప్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే హోటల్‌కి వెళ్లి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అనేకసార్లు అనిల్ తనపై అత్యాచారినికి పాల్పడినట్లు బాధితురాలు చెప్పడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Wife Compaliants Against Husband As Disha App,andhra pradesh ,disha app , wife , husband, woman, guntur, tadepalli , railway guard

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here