అనుమానంతో అది కోసేసింది

WIFE CUTS OFF HUSBAND PENIS

  • భర్త మర్మాంగాన్ని కోసేసిన భార్య
  • ఒడిశాలో దారుణం

అనుమానం పెనుభూతం అని ఊరికే అనలేదు. ఒక్కసారి ఎవరి మీదైనా అనుమానం కలిగితే, అది ఎంతకూ పోదు. కట్టుకున్నోడిపై అనుమానం పెంచుకున్న ఓ ఇల్లాలు.. అతడు ఆదమరిచి నిద్రపోతున్న సమయంలో ఏకంగా అతడి మర్మాంగాన్నే కోసేసింది. భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని ఆమెకు అనుమానం రావడంతో ఈ దారుణానికి ఒడిగట్టింది. ఒడిశాలోని నవరంగపూర్‌ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన బాధితుడు కోరాపుట్‌ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతు న్నాడు. నవరంగపూర్‌ జిల్లా తెంతులికుంటి సమితిలోని ఉదయపూర్‌ గ్రామానికి చెందిన ఓ యువకుడికి మూడేళ్ల కిందట వివాహం జరిగింది. స్థానికంగా పనులు లేకపోవడంతో ఇటుకబట్టీ కూలీగా వలస వెళ్లాడు.

కొన్నినెలల క్రితం గ్రామానికి తిరిగి వచ్చిన యువకుడు ఏ పనీ చేయకుండా ఇంటి దగ్గరే ఉంటున్నాడు. పనికి వెళ్లకుండా నెలల తరబడి భర్త ఇంటి వద్దే ఉండటంతో భార్యకు అనుమానం మొదలైంది. అతడికి వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో రోజూ గొడవకు దిగేది. అయినా అతడు పనికి వెళ్లకపోవడం.. తన అనుమానం మరింత పెరగడంతో భర్తపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో భర్త గాఢ నిద్రలో ఉన్న సమయంలో కాళ్లు, చేతులు కట్టేసి కత్తితో అతడి మర్మాంగాన్ని కోసేసింది. అతడి అరుపులు విని అక్కడకు వచ్చిన చుట్టుపక్కలవారు.. ఒక్కసారిగా నిశ్చష్టులయ్యారు. వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

CRIME NEWS

 

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article