పోలవరంపై సీఎం కేసీఆర్ స్పష్టత ఇస్తారా?

WILL CM KCR Gives Clarity on Polavaram

మరోసారి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అవుతున్నారు. గత రెండు సార్లు జరిగిన సమావేశాల్లో నిర్ణయించిన రూట్ మ్యాప్ లో భాగంగా రెండు రాష్ట్రాల అధికారులు ముఖ్యమంత్రులకు నివేదికలు ఇవ్వనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఫోన్ చేసి ప్రాధమికంగా ఈ రోజు చర్చించే అంశాల పైన విశ్లేషించారు. ఏపీ అధికారులను సైతం పూర్తి సమాచారం తో సిద్దంగా ఉండాలని సీఎం ఆదేశించారు. అయితే..ఈ సారి సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ రెండు కీలక అంశాలను ప్రస్తావించి..వాటి నుండి కేసీఆర్ నుండి స్పష్టత కోరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాయలసీమ ను గోదావరి నీటి వినియోగం గురించి ప్రతిపక్ష టీడీపీ ఆరోపణలు చేస్తోంది. దీనికి సంబంధించి ఈ సమావేశంలో స్పష్టత ఇవ్వనున్నారు. అదే సమయంలో ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి ప్రస్తావించాలని నిర్ణయించిన అంశాల పైన కేసీఆర్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారింది. ఈ నిర్ణయాల ఆధారంగానే రాజకీయంగా జగన్ ఏపీలో పైచేయి సాధించే అవకాశం ఉంటుంది. దీంతో..ఇప్పుడు ఈ సమావేశంలో చర్చించే అంశాలు..నిర్ణయాల పైన రాజకీయంగానూ ఆసక్తి నెలకొని ఉంది.ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు.

పోలవరంపై అభ్యంతరం లేదా?
పోలవరం ప్రాజెక్టు పైన తమకు అభ్యంతరాలు లేవని స్పష్టం చేసారు. అయితే.. పోలవరం పైన కోర్టులో కేసులు వేసిన కేసీఆర్ తో జగన్ స్నేహం ఎలా చేస్తారంటూ టీడీపీ నిలదీసింది. ఇక, ఇప్పుడు అదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఏపీ ప్రయోజనాలను కేసీఆర్ కు ముఖ్యమంత్రి జగన్ తాకట్టు పెడుతున్నారని విమర్శలు చేస్తోంది. ఇక, నవంబర్ లోగా పోలవరం రివర్స్ టెండరింగ్ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని భావిస్తున్న ముఖ్యమంత్రి జగన్ తాను కేసీఆర్ తో కలిసి రాయలసీమకు గోదావరి నీరు అందించే అంశాల పైన ఫోకస్ చేసారు. ఇదే సమయంలో కేసీఆర్ ఏపీ ప్రయోజనాలకు వ్యతిరేకం కాదనే విషయాన్ని స్పష్టం చేసే దిశగా కేసీఆర్ నుండి స్పస్టమైన ప్రకటన కోరాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగా పోలవరం పైన తాజాగా అసెంబ్లీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పైన టీడీపీ నేతల రియాక్షన్ సైతం వారి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతో.. పోలవరం ప్రాజెక్టు విషయంలో గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రకంగా అయితే సానుకూలంగా స్పందించారో..అదే విధంగా అధికారికంగా ప్రకటన చెయ్యాలని జగన్ కోరనున్నట్లు సమాచారం. అవసరమైతే ఒడిశా ముఖ్యమంత్రితోనూ మాట్లాడుతానని గతంలో కేసీఆర్ ముందుకు వచ్చారు. ఇప్పుడు అదే విషయాన్ని జగన్ మరోసారి స్పష్టత ఇచ్చేలా కేసీఆర్ వద్ద ప్రస్తావించనున్నారు. దీనికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ ఏ రకంగా స్పందిస్తారో..గతంలో చెప్పిన విధంగా ఇప్పుడు స్పష్టత ఇస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.

POLAVARAM LATEST NEWS

తెలంగాణ ఆడపడుచులూ.. బతుకమ్మ చీరెలు వచ్చేశాయి..!

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article