భూతవైద్యుడి నిర్వాకం ఆసుపత్రి పాలైన యువతి

పరిగి : భూతవైద్యుడు నిర్వాకంతో ఓ యువతి ఆస్పత్రి పాలైంది.మూఢనమ్మకాలతో తమ కూతురికి దయ్యం పట్టిందని భూత వైద్యుని ఆశ్రయించారు.ఆ భూతవైద్యుడు దయ్యాన్ని వదిలించేందుకు నిప్పులపై నిలిచి పెట్టించాడు ఆ యువతిని. దయ్యాన్ని తమ కూతురి దగ్గరనుంచి వధిలిస్తానని (తరమికొట్టేస్తానని) అన్నాడు. దూర ప్రాంతాల నుంచి ఎంతోమంది ఈ భూత వైద్యుని ఆశ్రయిస్తారు . ఒక్కొక్కరికి ఒక్కోలా దెయ్యాలను విడిపించేందుకు ఒక్కో రకంగా హింసిస్తూ ఉంటాడు. ఆ హింసించే రకంలో పశువులను కొట్టేందుకు ఉపయోగించే చండ్రకొలాతో కొట్టడం లాంటి పనులు చేస్తూ ఉంటాడు. ఇలాంటి పనులు చేసేందుకు ఓ దర్గాను ఎంచుకున్నాడు ఇక్కడికి అందరూ వస్తూ ఉంటారు. అదే అదునుగా తీసుకున్నా దొంగ బాబా అమాయకుల దగ్గర భూతాల పేరుతో వేలల్లో లక్షల్లో దోచుకుంటున్నాడు. ఆ స్థలం ఎక్కడో కాదు వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామ శివారులో ఉంది. మరి ఈ దొంగ బాబా నిర్వాకం చూడాలంటే నస్కల్ గ్రామానికి వెళ్లాల్సిందే. ఇక్కడ చేసిన ఆ దొంగ బాబా నిర్వాకం ఇది.
ఓ దొంగ బాబా నిర్వాకం* నిప్పులపై 2 కాళ్లు పెట్టించాడు. నికు మంచిగా జరుగుతుంది అన్నాడు. బాబా ఏదో చేస్తాడు అని నమ్మకంతో వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం కుక్ కింద గ్రామానికి చెందిన అశ్వని 18 సంవత్సరాలు ను తల్లిదండ్రులు గత శుక్రవారం నాడు నకిలీ బాబా దగ్గరికి తీసుకెళ్లారు. ఆ నకిలీ బాబా అమ్మాయి రెండు కాళ్లు ఒక చెయ్యి నిప్పులపై పెట్టించాడు. అశ్విని తల్లిదండ్రులు అదే రాత్రి అమ్మాయిని వికారాబాద్లోని ఓ ప్రైవేట్ఆస్పత్రిలో చేర్పించారు అమ్మాయి కాళ్లు చేతులు తీవ్ర గాయాలయ్యాయి. అశ్విని పరిస్థితి విషమంగా ఉంది.
మీకు దెయ్యం పట్టిందా అయితే నా దగ్గరికి రండి. కొన్ని గంటల్లో దయ్యం వెళ్ళిపోతుంది మీకు మంచి జరుగుతుంది ఆని మాయ మాటలతో నస్కల్ గ్రామానికి చెందిన రఫీ అనే నకిలీ బాబా మోసం. ఓ నకిలీ బాబా నిర్వాకం. వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ ఊరికి దగ్గరలో అటవీ ప్రాంతం దర్గా దగ్గర ప్రతి శుక్రవారం అమాయకులను మోసం చేసి లక్షల రూపాయల దండుకుంటున్నారు ఓ నకిలీ బాబా.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article