కుడివైపు గుండె ఉన్న 80 ఏళ్ల వృద్ధురాలు

న‌గ‌రంలో ప్ర‌ముఖ మ‌ల్టీ స్పెషాలిటీ ఆసుప‌త్రి అయిన గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రి వైద్యులు 80 ఏళ్ల వృద్ధురాలికి గుండెపోటు తీవ్ర‌స్థాయిలో రాగా.. ఆమె ప్రాణాలు కాపాడారు. సాధారణంగా అంద‌రికీ శ‌రీరంలో ఎడ‌మ‌వైపు గుండె ఉంటే, ఈమెకు మాత్రం అత్యంత అరుదుగా కుడివైపు ఉంది. ఇది పుట్టుక‌తోనే ఉండ‌టంతో గుండెకు ఉండే బృహ‌ద్ధ‌మ‌ని కూడా ఎడ‌మ‌వైపు కాకుండా కుడివైపు ఉంది. ఇంత పెద్ద‌వ‌య‌సులో మ‌హిళ‌కు, అది కూడా కుడివైపు ర‌క్త‌నాళంలో పూడిక‌ల‌కు చికిత్స చేయ‌డం చాలా రిస్కుతో కూడుకున్న వ్య‌వ‌హారం. అయినా ఆసుప‌త్రిలో అత్యంత అనుభ‌వ‌జ్ఞులైన వైద్యులు ఉండ‌టంతో దీన్ని ఎలాంటి ఇబ్బందీ లేకుండా విజ‌య‌వంతంగా పూర్తిచేశారు.

ఈ చికిత్స గురించి గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రి చీఫ్ కార్డియాల‌జిస్టు డాక్ట‌ర్ సాయి సుధాక‌ర్ మాట్లాడుతూ, “పెద్ద‌ వ‌య‌సు వారికి గుండెపోటు వ‌స్తే ‘గోల్డెన్ పీరియ‌డ్’లోనే యాంజియోప్లాస్టీ చేస్తేనే వారి ప్రాణాలు కాపాడ‌గ‌లం. ప్ర‌స్తుత కేసులో ఈ వృద్ధురాలిని తొలుత వేరే ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. గుండె క‌వాటాలు అన్నీ కుడివైపు ఉండ‌టం, అక్క‌డ బృహ‌ద్ధ‌మ‌ని క్ర‌మంగా స‌న్న‌బ‌డుతూ రావ‌డంతో ముందుగా రోగికి ర‌క్తం ప‌ల్చ‌బ‌రిచే మందులు ఇచ్చి అప్పుడు మ‌రో ఆసుప‌త్రికి త‌ర‌లించాల‌నుకున్నారు. చాలా క్లిష్ట‌మైన ప‌రిస్థితిలో ఆమెను గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రికి తీసుకొచ్చారు. ఇక్క‌డ నిపుణులైన వైద్య‌బృందం అత్యంత జాగ్ర‌త్త‌గా చికిత్స చేశారు. గుండె, ర‌క్త‌నాళాలు సైతం కుడివైపు ఉన్నా, నూరుశాతం పూడుకుపోయిన బృహ‌ద్ధ‌మ‌నికి విజ‌య‌వంతంగా చికిత్స చేశాం” అని వివ‌రించారు.

“మా బృందం అందుబాటులో ఉన్న వ‌న‌రుల‌తోనే ఈ స‌వాలును స్వీక‌రించింది. మేం ముందుగా యాంజియోగ్రామ్, త‌ర్వాత యాంజియోప్లాస్టీ చేసి, స్టెంట్ వేశాం. దాంతో ఆమె ప్రాణాలు కాపాడ‌గ‌లిగాం. చికిత్స త‌ర్వాత రోగిని రెండు రోజుల పాటు నిశిత ప‌రిశీల‌న‌లో ఉంచాం. చికిత్స‌కు ఆమె బాగా స్పందిస్తున్నార‌ని, వైట‌ల్స్ అన్నీ బాగున్నాయ‌ని గుర్తించిన త‌ర్వాత ఆమెను డిశ్చార్జి చేశాం. దాంతో ఆమె ఇంటికి వెళ్లి త‌న ప‌నులు మామూలుగా చేసుకుంటున్నారు” అని డాక్ట‌ర్ సుధాక‌ర్ తెలిపారు.

“ఇది చాలా అరుదైన చికిత్స‌. ఇప్ప‌టివ‌ర‌కు వైద్య చ‌రిత్ర‌లో కూడా ఇలాంటి ప‌రిస్థితుల్లో న‌యం చేయ‌డం చాలా స‌వాళ్ల‌తో కూడుకున్న‌ది. అయితే ఈ కేసులో అత్యంత నైపుణ్యంతో, సుర‌క్షితంగా చికిత్స చేసి, ఆమెను కాపాడినందుకు మాకెంతో సంతోషంగా ఉంది. త‌న త‌ల్లికి ప్రమాదం త‌ప్పి, ఆమె మ‌ళ్లీ ఇంటికి రావ‌డం, త‌న ప‌నులు తాను చేసుకోవ‌డంతో రోగి కుమార్తె ఎంత‌గానో సంతోషించారు” అని హైద‌రాబాద్ ల‌క్డీకాపుల్‌లోని గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రి సీఈవో గౌర‌వ్ ఖురానా తెలిపారు.

త‌దుప‌రి ప‌రీక్ష‌ల కోసం రోగి ఆదివారం గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రికి వ‌చ్చారు. ఆమె చాలా త్వ‌ర‌గా కోలుకుంటున్నార‌ని, ఆమె ఆరోగ్యానికి ఇప్ప‌టికిప్పుడు ఎలాంటి ముప్పు లేద‌ని ప‌రీక్ష‌ల‌లో తెలిసింది. గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రి న‌గ‌రంలో ఉన్న ఆసుప‌త్రుల్లోనే అత్యుత్త‌మ‌మైన‌ది. ఇక్క‌డ అత్యంత ఆధునిక ప‌రిక‌రాలు, మంచి శిక్ష‌ణ పొందిన సూప‌ర్ స్పెష‌లిస్టులు ఉన్నారు. వీరు ఎలాంటి స‌మ‌స్య‌నైనా నైపుణ్యంతో స‌రిచేస్తారు. మ‌రింత స‌మాచారం ఆసుప‌త్రి వెబ్‌సైట్‌లో ఉంది

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article