బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కామాంధుడు

womanizer burning a girl with with petrol… లైంగిక హింస

సభ్య సమాజం సిగ్గు పడే ఘటనలు నిత్యం మన చుట్టూ జరుగుతూనే ఉన్నాయి. మినార్ బాలిక పై ఆరు నెలలుగా అత్యాచారం చేసి బాలికను చంపే ప్రయత్నం చేశాడు ఓ కామాంధుడు. ప్రస్తుతం బాలిక చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది.
కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై ఓ కామాంధుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా కౌతాలం మండలం బదినేహల్ లో మౌలాల్ సాబ్ (35) అనే వ్యక్తి కొంతకాలంగా బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈనేపథ్యంలో రాత్రి మౌలాల్ సాబ్.. బాలికపై పెట్రోల్ పోసి తగులబెట్టి, హత్యాయత్నం చేశాడు. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి మంటలార్పారు. తీవ్ర గాయాలు కావడంతో బాలిక పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ఆమెను ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలిక తల్లిదండ్రులు, బంధువుల ఆర్తనాదాలతో ఆస్పత్రి ప్రాంగణం మారుమోగుతోంది. తమ కూతురిని చూసి బోరున విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

Check Out Latest Offers in Amazon

For more Political New

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article