తొలి టీ20లో భారత మహిళల పరాజయం

WOMEN CRICKETERS LOST T20

  • 23 పరుగుల తేడాతో కివీస్ జయభేరి
  • రాణించిన మంథాన

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత మహిళల జట్టు పరాజయం పాలయ్యారు. గెలవాల్సిన మ్యాచ్ ను చేజేతులా జారవిడుచుకున్నారు. కివీస్‌ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హర్మన్‌ప్రీత్‌ సేన 136 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్‌ స్మృతి మంధాన అర్ధశతకంతో రాణించినప్పటికీ మిగతావాళ్లు సరిగా రాణించలేకపోవడంతో భారత జట్టుకు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత జట్టు న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌ను ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో కివీస్‌ 4 వికెట్లు కోల్పోయి 159 పరుగులు సాధించింది. ఆ తర్వాత ఛేదనకు దిగిన హర్మన్‌ప్రీత్‌ సేన ఆదిలోనే తడబడింది. తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ ప్రియా పునియా ఔటయ్యింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జెమిమా రొడ్రిగస్‌తో కలిసి ఓపెనర్‌ స్మృతి మంధాన ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. ఈ క్రమంలో స్మృతి హాఫ్ సెంచరీ చేసింది. అయితే వెంటవెంటనూ ఈ ఇద్దరూ ఔట్ కావడంతో భారత జట్టు కోలుకోలేకపోయింది. ఇంకా ఐదు బంతులు మిగిలి ఉండగానే 136 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్‌ జట్టు 1-0తో ఆధిక్యంలోకి వచ్చింది.

SPORTS NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article