లాటరీ పేరుతో మోసం..

లాటరీ తగిిలిందంటే ఎక్కడ్లేని సంతోషమేసింది. ఇంకేముంది ఇంటి ముందు కొత్త కారు నిలబడుతుందని కలలు కన్నది. ఆ ఫీజు ఈ ఛార్జీ పేరిట సదరు కేటుగాళ్లు ఈ అమాయకురాలకు గట్టిగా టోపి వేశారు.

ఆన్ లైన్ మోసాల గురించి పోలీసులు, మీడియా ఎంత అవగాహన కల్పిస్తున్నప్పటికీ, కొందరు మోసపోతూనే ఉన్నారు. తాజాగా, ఓ సంఘటన మెహదీపట్నంలో జరిగింది. హైదరాబాద్ మెహదీపట్నం కు చెందిన ఓ మహిళకు లాటరీ ద్వారా కారు గెలుచుకున్నారని సైబర్ కేటుగాళ్ళు కాల్ చేశారు. ఇది నిజమేనని నమ్మిందా అమాయకురాలు. ఆ కారు డెలివరీ చేయాలంటే ప్రాసెసింగ్ ఫీజు పేరిట ఐదు లక్షల రూపాయల దాకా కాజేశారు. ఎంతకీ కారు రాకపోవడంతో మోసపోయానని గుర్తించిన ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

SourceTSNEWS
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article