వెనకబడిన వర్గాల సంక్షేమం, అభ్యున్నతి పేరుతో బీసీ మహిళాలను ఆర్దికంగా అరగించేశాడు.. డబ్బులు అడిగితే తిరిగి ఇవ్వకుండా తప్పుడు ప్రచారం.. చంపుతానని బెదిరింపులు, భయపడి బయటకు రాని బాధితులు ఎందరో ?
మాయమాటలు నేర్పుగా చెప్పి, లక్షల్లో ఆర్దికసాయం తీసుకోవటం కుదిరితే బలహీనత ఆసరా చేసుకుని లోబర్చుకోవటం … లోబడని వారిని లోబడినట్లుగా ప్రచారం చేసుకోవటంతో చిర్రెత్తిన మహిళాలు ఆవేదన, ఆక్రోషంతో శివతాండవం రూపంలో విడతాల వారిగా రంగనాధ్ కు దేహశుద్ది చేసిన ఉద్దంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళగిరి పట్టణానికి చెందిన పరసా రంగనాధ్ జిల్లా బీసి సంక్షేమ సంఘం అధ్యక్షునిగా ఉన్న సమయంలో వెనకబడిన వర్గాల అభ్యున్నతి, సంక్షేమం పేరుతో మంగళగిరి నియోజకవర్గంలోని బీసి మహిళాలను ఆర్దికంగా మోసగించినట్లు సమాచారం. దీంతో జిల్లా బాధ్యతల నుండి ఇటీవల రంగనాధ్ ను తొలగించారు. బీసీ మహిళాలను వేధించటం, అవసరం కోసం చెబదులుగా తీసుకున్న లక్షలాది రూపాయాలు తిరిగి ఇవ్వాలని కోరితే , అడ్డం తిరగటం, బెదిరించటం, వారిపై రంగనాధ్ తప్పుడు ప్రచారం చేస్తున్నడనే ఆరోపణాలతో బాధిత మహిళాలు పోలీసులను అశ్రయించిన వైనం.