WOMEN LEADER POST VIRAL
టిఆర్ఎస్ పార్టీలో మామా అల్లుళ్ల మధ్య పంచాయతీ ఎలా ఉన్నా బయటకు మాత్రం ఇద్దరి మధ్య విభేదాలు లేనట్టే నడుస్తుంటుంది. ఒక పక్క కేసీఆర్ తన కుమారుడు కెటిఆర్ రాజకీయ భవిష్యత్తుకు అడ్డు రాకుండా ఉండడానికి హరీష్ రావు ను జాతీయ రాజకీయాల్లోకి తీసుకు వెళుతున్నాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో కెసిఆర్ అన్న కూతురు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ పెద్ద రాజకీయ దుమారమే రేపుతోంది.
తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో సిద్దిపేట స్థానం నుంచి సంచలన మెజారిటీతో తన్నీరు హరీష్‌రావు విజయం సాధించిన విషయం తెలిసిందే. దేశంలోనే అత్యధిక శాతం ఓట్లు సాధించిన నేతగా ఆయన రికార్డు సాధించారు. ఆయితే ఆ స్థానంలో మళ్లీ మధ్య ంతర ఎన్నిక జరగనుందా?. ఆ స్థానం నుంచి పోటీచేసిన తన్నీరు హరీష్‌రావు రాజీనామా చేయనున్నారా?. సిద్ధిపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి దిగబోతున్నారా? అంటే తాజా పరిణామాలు అవుననే సంకేతాల్ని అందిస్తున్నాయి. తాజాగా టీపీసీసీ అధికార ప్రతినిధి ఆర్. రమ్యారావు వాట్సాప్ గ్రూప్‌లో పెట్టిన పోస్ట్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
రానున్న నాలుగు నెలల్లో సిద్ధిపేట నియోజక వర్గానికి మళ్లీ ఎన్నికలు జరగనున్నాయని ఆమె పెట్టిన పోస్ట్ కలకలం సృష్టిస్తోంది. ఇదిలా వుంటే హరీష్‌రావు రాజీనామా చేసిన ఈ స్థానం నుంచి ఆయన సతీమణి తన్నీరు శ్రీనిత ఎమ్మెల్యేగా పోటీకి దిగే అవకాశం వుందని, ఇప్పటికే ఆ వైపుగా చర్చలు కూడా పూర్తయ్యాయని మరో వార్త కూడా హల్‌చల్ చేస్తోంది. ప్రస్తుతం కలకలం సృష్టిస్తున్న వాట్స్ పోస్ట్ పెట్టిన రమ్యారావు స్వయానా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కూతురు కావడంతో ఈ వార్తకు మరింత ప్రాధాన్యత చోటు చేసుకుంది. సమీప బంధువు కావడంతో రమ్యారావు పెట్టిన పోస్టులో విశ్వసనీయత వుండే అవకాశం వుంది కాబట్టి ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
For More Click Here