మహిళా రిజర్వేషన్ బిల్లు మాటేంటి అంటున్న ఎంపీ కవిత

Women Reservation bill – ఈబీసీ సరే ..

అగ్రవర్ణాల్లోని నిరుపేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం బిల్లు ప్రవేశపెట్టడం అది ఆమోదం పొందడం అందరికీ తెలిసిందే. అతి తక్కువ సమయంలో బిల్లును పాస్ చేయించుకున్న కేంద్ర ప్రభుత్వం తీరుపై, ఈ బీసీ రిజర్వేషన్లపై రకరకాల విమర్శలు వస్తున్నాయి. వివిధ రాజకీయ పక్షాలు ఒక పక్క ప్రశంసిస్తూనే మరోపక్క తమ రాష్ట్రాల్లోని పరిస్థితులను గురించి తాము అడుగుతున్న రిజర్వేషన్ల గురించి కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు.

ఇక ఈ అంశంపై నిజామాబాద్ ఎంపీ కవిత కూడా కేంద్రాన్ని ప్రశంసిస్తూనే మరో కీలక అంశాన్ని లేవనెత్తారు. చాలా వేగంగా ఈ బిసి బిల్లును ఆమోదింపజేసుకున్న కేంద్ర ప్రభుత్వం అంతే వేగంగా మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా పెడితే బాగుంటుందని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై జాప్యం ఎందుకు జరుగుతుందని ఆమె కేంద్రాన్ని ప్రశ్నించారు. కావాలనే మహిళా రిజర్వేషన్ బిల్లు పక్కన పడేశారు అనే వాదనలు వినిపిస్తున్న తరుణంలో కవిత లేవనెత్తిన అంశం పార్లమెంటు సభ్యుల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇక టిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఈబిసి రిజర్వేషన్ ను స్వాగతిస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి మైనారిటీలు, ఎస్సీ రిజర్వేషన్ల పెంపు బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తోంది. ఇక ఎంపీ కవిత లేవనెత్తిన మహిళా బిల్లు అంశం కూడా పార్లమెంటులో ప్రాధాన్యతను సంతరించుకుంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article