ఏపీ ప్రభుత్వానికి అమరావతి నిర్మాణ రుణం ఆపేస్తూ వరల్డ్ బ్యాంక్ షాక్

WORLD BANK STOP GIVING MONEY FOR AMARAVATHI

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంకు భారీ షాక్ ఇచ్చింది. ఏపీ రాజధాని నిర్మాణానికి ఎలాంటి సహకారం అందించేది లేదని ప్రపంచ బ్యాంకు తేల్చి చెప్పింది. అయితే ప్రపంచ బ్యాంకు తీసుకున్న ఈ కీలకమైన నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో జగన్ ఉన్నాడని సమాచారం. అయితే గతంలో అమరావతి నిర్మాణానికి అండగా నిలవాలనుకున్న ప్రపంచ బ్యాంకు జగన్ ప్రభుత్వ అవలంబిస్తున్న వైఖరి కారణంగా వెనక్కి తగ్గుతుంది.

గతంలో రాజధాని నిర్మాణానికి ప్రపంచబ్యాంకుకు రైతుల పేరిట పంపించిన ఈమెయిల్స్ వెనకాల వైసీపీ ఉందని, వైసీపీ నేతలే ఇలాంటి కార్యక్రమాలకి పాల్పడుతున్నారని ఆ మధ్యలోనే టీడీపీ వారి ఫిర్యాదు చేశారు. ఈ రాజధాని నిర్మాణానికి, ఇక్కడికి వచ్చి, ఇక్కడి పరిస్థితులన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకొని, పరిశీలనలు జరిపి నిర్మాణానికి క్లియరెన్స్ ఇచ్చిన ప్రపంచ బ్యాంకు ఇపుడు చేతులు ఎత్తేసింది. ఇక ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు రుణాలపై రాజధాని నిర్మాణానికి 14,00 కోట్లు గతంలో ఇచ్చేందుకు సమ్మతం తెలిపిన ప్రపంచ బ్యాంకు నేడు రాజధాని ప్రాజెక్టు నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. కాగా ఆప్కో కొత్త వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజుల్లోనే ప్రపంచ బ్యాంకు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం, రాజధానికి 2,100 కోట్ల రుణాన్ని నిలిపి వేయటం అనేది ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వైఖరి వల్లే అని తేల్చి చెప్పేసింది. కాగా ఈసమయంలో ఆంధ్రరాదేశ్ ముఖ్యమంత్రి జగంహ్మన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని అందరు కూడా ఎదురుచూస్తున్నారు… ఏదేమైనప్పటికీ ఇది జగన్ కి పెద్ద దెబ్బ అనే చెప్పాలి.

MOVIE REVIEW

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article