వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్ రివ్యూ…

World Famous Lover Trailer Review

విజ‌య్ దేవ‌ర‌కొండ అర్జున్ రెడ్డి సినిమాతో టాప్ రేస్‌లో ఉన్నాడు. ఒక్క‌సినిమాతో మంచి పేరు ద‌క్కించుకున్నాడు. అయితే ఆయ‌న తాజాగా మ‌రో అద్భుత‌మైన చిత్రంతో మ‌న‌ముందుకు రానున్నాడు. వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ సినిమాతో విజ‌య్ న‌ట విశ్వరూపాన్ని మ‌రోసారి చూపించ‌నున్నాడు. ఫిబ్రవరి 14న రిలీజ్ కానున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైంది. మ‌రి చిత్ర ట్రైల‌ర్ ఎలా ఉందో చూద్దాం…

ఈ సారి అన్నింటికంటే స్వచ్ఛమైనది ప్రేమ అంటూ ట్రైలర్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత వరసగా నలుగురు అమ్మాయిల కారెక్టర్స్ రివీల్ చేస్తూ వెళ్లాడు క్రాంతి మాధవ్. ముఖ్యంగా మధ్యలో చాలాసార్లు అర్జున్ రెడ్డిని గుర్తు చేసాడు విజయ్. హీరోయిన్లతో విజయ్ లిప్ లాక్ సీన్స్ కూడా చాలానే ఉన్నాయిందులో. అదేవిధంగా హీరోయిన్ల విష‌యానికి వ‌స్తే… రాశి ఖన్నా ను పార్టనర్ గా.. ఐశ్వర్య రాజేష్ ను వైఫ్ గా.. కాథరిన్ ట్రెసా ను ఫాంటసీ గా.. ఇజబెల్ ను గర్ల్ ఫ్రెండ్ గా పరిచయం చేశారు. ఙ‌క‌పోతే హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్‌ను దృష్టిలో పెట్టుకొని మీ ఆడోళ్లకు అసలు ఆగదా.. బట్ట కొంటే ఒంటి మీద వేసేయడమేనా. అంటూ చెప్పే డైలాగ్ ఆసక్తిగా ఉంటుంది. మొత్తానికి విజయ్ దేవరకొండ ఫెర్ఫార్మెన్స్‌కు ఇమేజ్ దృష్టిలో ఉంచుకొని ట్రైలర్ రూపొందిచారు. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా.. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వ‌ల్ల‌భ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. కాగా, వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

World Famous Lover Trailer Review,#VijayDeverakonda,#WorldFamousLover,#WFL,Public Talk On World Famous Lover,tollywood updates

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article