వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్

177
#World Famous Lover Trailer
#World Famous Lover Trailer

#World Famous Lover Trailer

అర్జున్ రెడ్డితో సక్సెస్ అంటే ఏంటో రుచి చూపించిన హీరో విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమాతో మొదటి క్లాసికల్ హిట్ అందుకున్న విజయ్ అర్జున్ రెడ్డి సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఇక తాజాగా ఆయన మరో అద్భుతమైన సినిమాతో రాబోతున్నాడు.  విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో, క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో తెరకెక్కుతున్న మూవీ వరల్డ్ ఫేమస్ లవర్.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో రాశీఖన్నా, ఐశ్వర్యారాజేష్, కేథరీన్, ఇజబెల్లా నలుగురు హీరోయిన్లు నటించారు. మరోవైపు ఈ సినిమాలో విజయ్ నాలుగు డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపిస్తారు. ఇప్పటికే సినిమా టీజర్ విడుదలై ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా ట్రైలర్ నేడు రిలీజ్ కానుంది.  ఫిబ్రవరి 6న సాయంత్రం ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ ను విడుదల చేయనున్నారు.దీనికి సంబందించిన పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేశారు..మొత్తానికి ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కాబోతోంది.

#World Famous Lover Trailer,Deverakonda World Famous Lover,trailer release,#Vijay Deverakonda

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here