- ఆరోగ్యకరమైన జీవనాన్నిప్రోత్సహించేందుకు 10 కి.మీ. సైక్లింగ్, 5 కి.మీ. రన్ నిర్వహించిన ఆసుపత్రి
- హ్యాపీ హైదరాబాద్ సైక్లింగ్ క్లబ్ మరియు హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్‌తో కలిసి కార్యక్రమ నిర్వహణ
హైదరాబాద్, సెప్టెంబర్ 29, 2021: సమాజంలోని ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహించేందుకు “ప్రపంచ గుండె దినోత్సవం” సందర్భంగా నగరంలోని ప్రధాన ఆసుపత్రులలో ఒకటైన ఎస్ఎల్జీ ఆసుపత్రిలో సైక్లింగ్ మరియు రన్నింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న ఉండే హార్ట్ డేను ఈసారి ‘అనుసంధానానికి గుండెను ఉపయోగించండి’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. గుండె కవాటాల వ్యాధులను అధిగమించడానికి ఇది ఉపయోగపడుతుంది.
‘ఆరోగ్యకరమైన గుండె, ఆరోగ్యకరమైన వాతావరణం’ను ప్రోత్సహించేందుకు ఎస్ఎల్జీ ఆసుపత్రి ఆధ్వర్యంలో 10 కిలోమీటర్ల సైక్లింగ్, 5 కిలోమీటర్ల రన్ నిర్వహించారు. కొవిడ్-19 కారణంగా ప్రపంచమంతా ఎదుర్కొన్న ఆరోగ్యరంగ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రజలకు.. ముఖ్యంగా మన సమాజంలో అల్పాదాయవర్గాలకు గుండె ఆరోగ్యం గురించి అవగాహన కల్పించేందుకు, ఈ కార్యక్రమాన్ని అత్యవసరంగా నిర్వహించారు.
ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా ఎస్ఎల్జీ ఆసుపత్రి రూ.999/-కే ‘కార్డియాక్ హెల్త్ ప్యాకేజి’ ప్రవేశపెట్టింది. ఇందులో ఈసీజీ, 2డీ ఎకో, రక్తపోటు, లిపిడ్ ప్రొఫైల్, ర్యాండమ్ బ్లడ్ షుగర్ పరీక్షలతో పాటు కార్డియాలజిస్టు కన్సల్టేషన్ కూడా ఉంటుంది.
సైక్లింగ్, రన్ కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా ఎస్ఎల్జీ ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డీవీఎస్ సోమరాజు మాట్లాడుతూ, “గుండె కవాటాల వ్యాధుల వల్ల ప్రతియేటా లక్షలాది మంది మరణిస్తున్నారు. ఈ వ్యాధులకు కారకమయ్యే అంశాలను మనమే మార్చుకోవచ్చు. అవి వ్యాయామం లేకపోవడం, ధూమపానం, సరైన ఆహారం తీసుకోకపోవడం. మేం కేవలం అనారోగ్యానికి చికిత్స చేయడమే కాదు, మన సమాజంలోని ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహించాలని బలంగా నమ్ముతాం. ఎస్ఎల్జీ ఆసుపత్రిలోని అన్ని విభాగాలకు చెందిన వైద్యులు వ్యక్తులకు ఆరోగ్యకరంగా జీవించడం ఎలాగో చెప్పడంతో పాటు వ్యాధులు రాకుండా నిరోధించడం ఎలాగో చెబుతారు” అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎల్జీ ఆసుపత్రి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దండు శివరామరాజు, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్ పాణిగ్రాహి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ హరిహరన్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ భానుకిరణ్ రెడ్డి, మార్కెటింగ్ జీఎం చందర్ తేజావత్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఎస్ఎల్జీ ఆసుపత్రి రూ.999/-కే ‘కార్డియాక్ హెల్త్ ప్యాకేజి’ ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. ఇందులో ఈసీజీ, 2డీ ఎకో, రక్తపోటు, లిపిడ్ ప్రొఫైల్, ర్యాండమ్ బ్లడ్ షుగర్ పరీక్షలతో పాటు కార్డియాలజిస్టు కన్సల్టేషన్ కూడా ఉంటుంది.
ఉదయం 6 గంటలకు ప్రారంభమైన కార్యక్రమంలో 500 మందికి పైగా ఔత్సాహికులు పాల్గొన్నారు. వారందరికీ వరల్డ్ హార్ట్ డే టీషర్టులతో పాటు ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహించడంలో వారి భాగస్వామ్యానికి గుర్తింపుగా పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు కూడా ఇచ్చారు. ఈ ప్రచారం ద్వారా, అన్ని వర్గాలకు చెందినవారిని ఏకం చేసి, గుండె కవాటాల వ్యాధుల భారంపై పోరాటానికి సిద్ధం చేసి, గుండెకు ఆరోగ్యాన్ని అందించే జీవనశైలిని ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది.