హైపర్ టెన్షన్ పై అప్రమత్తత

హైదరాబాద్ : వరల్డ్ హైపర్ టెన్షన్ డే ను పురస్కరించుకొని, కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా సహకారంతో, గ్లీనీగ్లేస్ గ్లోబర్ ఆసుపత్రి 9000 మందిపై చేసిన సర్వే ఫలితాలను ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తాజ్ డెక్కన్ లో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ వ్యాధి పట్ల అవగాహన కల్పించడం కోసం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా హైపర్ టెన్షన్ డే ని నిర్వహించడం జరుగుతుంది. సి ఎస్ ఐ వారు ఇచ్చిన సర్వే ఫలితాలు కొంత ఆశ్చర్యం, బాధను కల్గిస్తున్నాయ్. నిమ్స్ లో చేసిన సర్వే ప్రకారం ,ఎవరైతే కిడ్నీ సమస్యలు ఉన్నారో వారిలో 60 శాతం మందికి హైపర్ టెన్షన్ ఉంది. బిపి ని ,షుగర్ ని ముందుగా గుర్తించి జాగ్రత తీసుకోకపోతే వ్యాధి ప్రాణాంతకంగా మారుతుంది. లైఫ్ స్టైల్స్ మార్పులు వలన ఈ సమస్యలు వస్తున్నాయి. ప్రజలు తమ ఆరోగ్యం పట్టించుకోకుండా తీవ్రమైన ఒత్తిడి గురివుతున్నారు. ఇంతకు ముందు శారీరకంగా శ్రమ ఉంటుండే ఇప్పుడు నో ఫిట్నెస్. ఆహారం అలవాట్లు బాగా మారిపోయింది. తెలంగాణ ప్రభుత్వం ఈ సమస్యని గుర్తించి ఎన్ సి డి స్క్రీనింగ్ చేస్తున్నాం. 90 లక్షలు మందికి స్క్రీనింగ్ చేస్తే , తమ స్క్రీనింగ్ లో 13 లక్షలు మందికి హైపర్ టెన్షన్ గుర్తించాం. వచ్చే 2 ,3 నెలలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి బిపి,షుగర్ టెస్ట్ లో చేయాలని నిర్ణయచుకున్నాం, 33 కోట్ల రూపాయలు కూడా నిధులు కెటయించుకున్నము. మందుల కిట్ ద్వారా ఉచితంగా మందులు ఇస్తున్నాం. మందులు వాడుతున్నారా లేదా అని తెలుసుకోవడం కోసం కాల్ సెంటర్ పెట్టాము. ఇండియా లో ఎన్ సి డి స్క్రీనింగ్ లో తెలంగాణ 3 స్థానంలో ఉంది. రానున్న 3,4 నెలలు మొత్తం గా పూర్తి చేసి దేశంలోనే మొదటి స్థానంలోకి తీసుకు వస్తమని అన్నారు.
ఆయుష్ ద్వారా 450 వెల్ నెస్ సెంటర్లు ద్వారా మంచి ఆరోగ్యం పట్ల ట్రైనింగ్ ఇవ్వనున్నాం. పోస్ట్ కోవిడ్ ద్వారా హైపర్ టెన్షన్ కొంత పెరిగినట్టు కనిపిస్తుంది. ఫిజికల్ యాకిటివిట్ ని పెంచాలి. పిల్లలకు వెల్త్ కాదు, హెల్త్ ఇవ్వాలి తల్లితండ్రులు. చిన్న పిల్లలకు కూడా కిడ్నీ సమస్యలు ఉంటున్నాయి. హైదరాబాద్ నగరం మొత్తం సర్వే చేస్తాం. 350 బస్తి దవఖానల్లో ద్వారా 57 టెస్ట్ లో చేస్తున్నాం. వచ్చే నెల నుంచి 120 పైగా టెస్ట్ లో చేయనున్నాం. రిపోర్ట్స్ ని పేషెంట్,డాక్టర్ లకు మొబైల్ ద్వారా 24 గంటల్లో పంపిస్తున్నాం. 45 సంవత్సరాలు దాటినా వారిలో బిపి ,సుగర్ టెస్టులను చేయించుకోవాలని కోరుతున్నామని అన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article