వరల్డ్ స్పారో డే

159
World Sparrow Day 2021
World Sparrow Day 2021

World Sparrow Day 2021

పక్షులు, ముఖ్యంగా పిచ్చుకలు మానవ జీవన విధానంలో భాగంగా కొనసాగాయని, అవి అంతరించి పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ ఉద్యానవనం (కేబీఆర్ పార్క్)లో జరిగిన ప్రపంచ పిచ్చుకల దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. పక్షుల ప్రాధాన్యతను అందరికీ గుర్తు చేసేలా తాను గిఫ్ట్ ఏ నెస్ట్ కార్యక్రమాన్ని మొదలుపెట్టనున్నట్లు వెల్లడించారు. వివిధ వేడుకలు, దినోత్సవాల్లో బహుమతిగా మొక్కలు, సహజ సిద్దంగా తయారు చేసిన పిట్ట గూళ్లు ఇచ్చే సంస్కృతి రావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం, అటవీ శాఖ చర్యల వల్ల తెలంగాణలో అడవులు, పర్యావరణం బాగా మెరుగుపడిందని, జంతువులు, పక్షి జాతుల సంచారం కూడా గతంతో పోల్చితే స్పష్టంగా పెరిగిందని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ అన్నారు. చిన్నతనంలో పిచ్చుకలతో ఆడుకున్న రోజులు అందరికీ గుర్తేనని, ఆ మధురస్మృతులు వచ్చే తరానికి అందించడమే అందరి కర్తవ్యం కావాలన్నారు.

పిచ్చుకల దినోత్సవంలో భాగంగా కేబీఆర్ పార్కులో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయమే బర్డ్ వాచింగ్ తో పాటు, పర్యావరణ అవగాహన, అటవీ ప్రాంతాల్లో చేయదగిన, చేయకూడని పనులు, పిట్టుగూళ్ల పంపిణీ, పిల్లలకు డ్రాయింగ్, స్లోగన్స్ తయారీ, సిగ్నేచర్ కాంపెయిన్ లను నిర్వహించి చీఫ్ కన్జర్వేటర్ ఎం.జే. అక్బర్ బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో అదనపు పీసీసీఎఫ్ సిద్దనంద్ కుక్రేటీ, హైదరాబాద్ బర్డింగ్ పాల్స్, నేచర్ లవర్స్, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ సంస్థల ప్రతినిధులు, హైదరాబాద్ జిల్లా అటవీ అధికారి జోజి, పర్యావరణ నిపుణుడు జి. సాయిలు, కేబీయార్ పార్కు నిర్వహణ సిబ్బంది, వాకర్స్ అసోసియేష్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Kbr Park Latest News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here