Wow.. Kim Jong Un
హమ్మయ్యా.. కిమ్ జాంగ్ ఉన్ ప్రత్యక్షమయ్యాడు. గత కొంతకాలం నుంచి ఆయన ఉన్నాడా? మరణించాడా? అనే వార్తలు గుప్పుమన్నాయి. ఈ పుకార్లు ఎంతగా వినిపించాయంటే, ఆయన తర్వాత సోదరి దేశాధ్యక్ష బాధ్యతలను చేపడుతుందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆయన ఆరోగ్యం క్షీణించిందని, కోమాలోకి వెళ్లిపోయాడని రకరకాల వార్తలు వినిపించాయి. కాకపోతే, ఉత్తర కొరియా దేశాధ్యక్షుడైన కిమ్ జాంగ్ ఉన్ ఏప్రిల్ 11 తర్వాత మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. నార్త్ కొరియా అధికారిక పత్రికా ఏజెన్సీ కేసీఎన్ఏ ప్రకారం.. ఆయన శనివారం రాజధానిలో ప్యాంగాంగ్ లోని తూర్పు ప్రాంతంలో ఎరువుల ప్లాంటు పూర్తయిన సందర్శంగా కనిపించాడట. ఆ కార్యక్రమానికి ఆయన విచ్చేశాడట. దీంతో, కిమ్ జాంగ్ ఉన్ పై వెలువడిన ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడింది. అయితే, ఆయన బ్రతికే ఉన్నాడని దక్షిణ కొరియా ఇటీవల అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Related posts:
యూకే వైరస్ హంబక్కేనా?
వచ్చే 3 నెలలు జాగ్రత్త
అదిరె అదిరె.. ఫొటోషూట్ అదిరె
ఖమ్మం మిర్చికి చైనాలో డిమాండ్
ఆ ఐదుగురిని అప్పగించిన చైనా
పాపం.. ఇమ్రాన్ ఖాన్
ఫేస్ బుక్ జియోలో ₹ 43,574 పెట్టుబడి
60 రోజుల్లో అమెరికాను వదిలివెళ్లాలి
రెండు వారాలు కీలకమన్న ట్రంప్
కరోనా వల్ల 28,687 మంది మృతులు
కరోనా గురించి ముందే చెప్పిన వెబ్ సీరీస్
కరోనా వైరస్ గురించి షాకింగ్ నిజాలు
లక్షల ఉద్యోగాలు కాస్ట్ కటింగ్
కరోనా కి కారణం చైనా అధ్యక్షుడే
హ్యుండాయ్ యూనిట్ మూసివేత