Wrong News on Baskar Batla Sharma
సికింద్రాబాద్ స్టేషన్ సమీపంలోని సంతోషిమాతా దేవాలయం(దర్జీగుడి)లో ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్న భాస్కరభట్ల రామశర్మ పై చీరలు దొంగిలించాడని తప్పుడు అభియోగం మోపి ఈఓ విఠలయ్య కేసుపెట్టి అక్రమ అరెస్టు చేయించడాన్ని నిరసిస్తూ ఇవాళ ఆదివారం వందలాది మంది అర్చకుకు,పురోహితులు ఆలయంలో ధర్నా నిరసన చేపట్టారు..దర్శనమ్ సంపాదకులు మరుమాముల వెంకటరమణ శర్మ ఆధ్వర్యంలో శ్రీయుతులు బోర్బట్ల హనుమంతాచార్య,మల్లాది చంద్రమౌళి, గట్టుశ్రీనివాసాచార్యులు, రాహుల్ దేశ్ పాండే,నరేష్ కులకర్ణి, రఘు,నారాయణ శ్రీదేవి,రామశర్మ,మంగేష్ కుమార్ సహా వందలాదిమంది అర్చకులు, బ్రాహ్మణదసంఘాల నాయకులు ఈ నిరసన లో పాల్గొన్నారు.రామశర్మ పై తప్పుడు కేసుపెట్టి అరెస్ట్ చేయించి మానసిక వ్యధకు లోను చేసిన ఈఓ విఠలయ్యను వెంటనే సస్పెండ్ చేసి అర్చకుడిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. కుట్రపూరితంగా రామశర్మపై ఫిర్యాదు చేసిన మాజీ దేవాలయ కమిటీ చైర్మన్, ట్రస్టీపై కుట్ర కేసు నమోదు చేయాలని నినదించారు. అరెస్టు చేయించి జైలుకు పంపి ప్రధాన అర్చకుడు రామశర్మను తీవ్ర మానసిక వ్యధకు లోను చేశారని..ఒకదశలో తీవ్ర అవమానభారంతో రామశర్మ ఆత్మహత్యాయత్నానికి ఉపక్రమించగా బంధువులు వారించారని వారు పేర్కొన్నారు.ఇంత దారుణమైన,పైశాచిక కుట్రపూరిత ఈఓ, మాజీ ట్రస్టీల చర్యను యావత్తు హిందూ సమాజం ఖండించాలని వారంతా ముక్తకంఠంతో కోరారు.ఈమధ్య ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అర్చకులు,పురోహితులు, వేదపండితులపై అధికారులు కర్ర పెత్తనం తో జులుం చేలాయిస్తూ తీవ్రంగా వేధిస్తున్నారని దీనిపై ప్రభుత్వం, దేవాదాయశాఖ స్పందించాలని కోరారు.అర్చకులు, వేదపండితుల, పురోహితుల రక్షణ చట్టాన్ని తీసుకు రావాలని డిమాండ్ చేశారు.దీనిపై మంగళవారం దేవాదాయశాఖ మంత్రి, కమిషనర్ కు విజ్ఞాపన పత్రాలు ఇవ్వనున్నామన్నారు. ఉదయం ఎనిమిది గంటలనుంచి,మధ్యాహ్నం 12 గంటల దాకా దర్జీగుడి లో బ్రాహ్మణ నేతలు,అర్చకుల నిరసనలతో ఆలయ ప్రాంగణం హోరెత్తింది.