వైసీపీ ప్రలోభాలు పనిచేయకే ఇదంతా….

101
yanamala ramakrishnudu fires on ycp govt
yanamala ramakrishnudu fires on ycp govt

yanamala ramakrishnudu fires on ycp govt

ఏపీలో నేడు మండలి రద్దు దిశగా అడుగులు వేస్తున్న వైసీపీ తీరుపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది . శాసనమండలి రద్దు యోచనపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు . సీఎం జగన్ మోహన్ రెడ్డి కావాలని కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్సీలపై సీఎం జగన్ ప్రలోభాలు పనిచేయలేదని ఆయన పేర్కొన్నారు . మండలి రద్దు నిర్ణయం తీసుకోవటం వెనుక కారణాలను ఆయన పేర్కొన్నారు.

గడిచిన 3 రోజుల్లో ప్రలోభాలు పనిచేయకే వైసీపీ అక్కసు రెట్టింపు అయిందని యనమల రామకృష్ణుడు విమర్శించారు. శాసనమండలి రద్దు అమల్లోకి రావాలంటే రెండు, మూడేళ్లు పడుతుందని ఆయన వివరించారు. రాజ్యాంగ వ్యవస్థల రద్దు మీరు అనుకున్నంత సులభం కాదని జగన్ కు  హితవు పలికారు. మండలి రద్దు అంటే ప్రజావేదిక కూల్చినంత ఈజీ కాదన్నారు యనమల . ఏడాదిలో వైసీపీకి మెజార్టీ వస్తుంది.. అయినప్పటికీ ఎందుకు రద్దు చేస్తున్నారు? అర్థం కావడంలేదని యనమల ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here