యాత్ర సినిమా ప్రీమియర్ షో టికెట్ వేలం

YATHRA MOVIE PREMIER SHOW TICKET BIDDING

వైయస్ రాజశేఖర రెడ్డి పైన ఒక ప్రవాసాంధ్రుడు తన అభిమానాన్ని చాటుకున్నాడు. యాత్ర సినిమా ప్రీమియర్ షో టికెట్ ను వేలంపాటలో 6116 డాలర్లకు దక్కించుకున్నాడు. తనకు అత్యంత ఇష్టమైన వైయస్ రాజశేఖర్ రెడ్డి సినిమా యాత్ర మొదటి టికెట్ ను గెలుచుకోవడం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని ఆయన మురిసిపోతున్నాడు. ఇంతకీ యాత్ర సినిమా టికెట్ ను ఆయన ఎంతకు గెలుచుకున్నారు అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల నాలుగు లక్షల 37 వేల రూపాయలు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి రాజకీయ జీవితంలో భాగమైన పాదయాత్ర ఆధారంగా యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఈనెల 8న విడుదల అవుతోంది. మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి వైయస్ పాత్రలో నటించాడు. ఈ మధ్యే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను చిత్రయూనిట్‌ నిర్వహించింది. ఈ ఈవెంట్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. 70ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ అమెరికాలోని సీటెల్‌లో ‘యాత్ర’ ప్రీమియర్‌ షో మొదటి టికెట్‌ను వేలం వేశాయి. అందులో మునీశ్వర్‌ రెడ్డి 6,116 డాలర్లకు(దాదాపు 4.37లక్షలు) మొదటి టికెట్‌ను గెలుచుకున్నారు. అయితే $12 విలువ చేసే టికెట్‌ను అతనికి అందించి.. మిగతా డబ్బులను వైఎస్సార్‌ ఫౌండేషన్‌కు విరాళంగా ఇస్తామని చిత్ర నిర్మాతలు తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article