YATRA REVIEW

YATRA MOVIE REVIEW
సినిమా:  యాత్ర‌
బ్యానర్ – 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్
నటీన‌టులు: మమ్ముట్టి, రావు ర‌మేష్, జగపతిబాబు, సుహాసిని, అనసూయ, పోసాని, సచిన్ కడ్కర్, వినోద్ కుమార్, జీవా, 30 ఇయర్స్ పృథ్వి…..తదితరులు
సినిమాటోగ్రాఫర్ – సత్యన్ సూర్యన్
మ్యూజిక్ – కె ( క్రిష్ణ కుమార్ )
ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్
సాహిత్యం – సిరివెన్నెల సీతారామ శాస్త్రి
ప్రొడక్షన్ డిజైన్ – రామకృష్ణ, మోనిక సబ్బాని
సౌండ్ డిజైన్ – సింక్ సౌండ్
వి ఎఫ్ ఎక్స్ – Knack Studios
సమర్పణ – శివ మేక
నిర్మాతలు – విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – మహి వి రాఘవ్
వై.యస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పేరు చెప్ప‌గానే క‌డ‌ప జిల్లా ఎంత మందికి గుర్తుస్తుందో లేదోగానీ, ఆయ‌న చేసిన పాద‌యాత్ర మాత్రం గుర్తుకొస్తుంది. ప‌ల్లెప‌ల్లె తిరిగి ఆయ‌న చేసిన పాద‌యాత్ర ఆయ‌న గెలుపులో కీల‌క పాత్ర పోషించింద‌ని అంటారు. వై.య‌స్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి జీవిత క‌థ‌ను ఆధారంగా చేసుకుని తెర‌కెక్కిన సినిమా `యాత్ర‌`. నేత‌ల బ‌యోపిక్‌ల‌కు మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతున్న నేప‌థ్యంలో వ‌చ్చిన సినిమా. ఎలా ఉంది? ఏంటి? అనేది తెలుసుకోవాలంటే జ‌స్ట్ హావ్ ఎ లుక్‌.
క‌థ‌:
ఎన్నిక‌లు రాబోతున్న స‌మ‌యంలో అన్నీ పార్టీల అభ్య‌ర్థులు టికెట్స్ ఆశిస్తుంటారు. వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి(మమ్ముట్టి)  జిల్లాలోని ఓ నియోజ‌క వ‌ర్గంలో స‌బ్బారెడ్డి అనే అభ్యర్థికి టికెట్‌ను కేటాయిస్తుంది హై కమాండ్‌. కానీ కానీ సుబ్బారెడ్డిచే చంప‌బ‌డ్డ రామిరెడ్డి కుమార్తె సుచ‌రిత‌(అన‌సూయ‌) వ‌చ్చి రాజ‌శేఖ‌ర్ రెడ్డి స‌హాయం కోరుతుంది. హై క‌మాండ్‌ను కాద‌ని.. సుచ‌రిత‌కు టికెట్ ఇవ్వ‌డంతో క‌థ మొద‌ల‌వుతుంది. అధికార పార్టీ మ‌న‌దేశం ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు నోటీఫికేష‌న్ ఇస్తుంది. దీంతో వై.ఎస్ పార్టీ ప్ర‌తినిధులు ఏం చేయాలో ఆలోచ‌న‌లో ప‌డ‌తారు. అయితే జ‌రుగుతున్న ప‌రిణామాల దృష్ట్యా వై.ఎస్ ప్ర‌జ‌ల క‌ష్ట సుఖాల గురించి తెలుసుకుని ఓ నాయకుడిగా అండ‌గా నిల‌బ‌డాల‌నుకుంటాడు. ఆ క్ర‌మంలో పాద‌యాత్ర చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంటాడు. అందుకు హై క‌మాండ్ నుండి ముందు ప‌ర్మిష‌న్ రాక‌పోయినా.. రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాద‌యాత్ర‌ను స్టార్ట్ చేస్తాడు. క్ర‌మంలో ప్ర‌జల్లో వై.ఎస్‌కు ఆద‌ర‌ణ పెరుగుతుంటుంది. పాద‌యాత్ర చేసే స‌మ‌యంలో వై.ఎస్‌.ఆర్‌ను క‌దిలించిన ప‌రిస్థితులేంటి?  వాటికి ఆయ‌న స్పంద‌నేంటి?  అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…
స‌మీక్ష‌:
వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఎదిగే క్ర‌మంలో ఆయన్ని ప్ర‌జ‌ల‌కు చేరువ చేసింది. ఆయ‌న చేసిన పాద‌యాత్ర‌. కాబ‌ట్టి ఆయ‌న రాజ‌కీయ జీవితంలోని పాద‌యాత్ర అనే ఘ‌ట్టాన్ని ఆధారంగా చేసుకుని `యాత్ర‌` చిత్రాన్ని తెరెక్కించాడు ద‌ర్శ‌కుడు మ‌హి.వి.రాఘ‌వ్ . అస‌లు వై.ఎస్ ఎందుకు పాదయాత్ర చేయాల్సి వ‌చ్చింద‌నే దానిపై సినిమాటిక్ యాంగిల్‌ను చూపించినా.. పాద‌యాత్ర చేసే క్ర‌మంలో ఆయ‌న చూసిన ప‌రిస్థితుల‌ను ఆధారంగా చేసుకుని ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ పెట్టాడు. ఆ క్ర‌మాన్ని చ‌క్క‌గా చూపించాడు. ఇందులో ఆయ‌న ఫేస్ చేసిన సిచ్యువేష‌న్స్‌ను ఎమోష‌న‌ల్‌గా చూపించారు. రైతుకి గిట్టుబాటు ధ‌ర క‌ల్పించ‌డం.. ఆరోగ్య‌శ్రీ, ఉచిత క‌రెంటు, ఉచిత విద్య ఇలాంటి ప‌థకాల వెనుకున్న కార‌ణాల‌ను ఎమోష‌న‌ల్ యాంగిల్‌లో చూపించారు. అయితే వై.ఎస్‌ను పూర్తిగా హై కమాండ్ వ్య‌తిరేకిగానే చూపించారు. అయితే ఆయ‌నేం హై క‌మాండ్ వ్య‌తిరేకికారు. కానీ సినిమా అంతా ఆయ‌న వ్య‌తిరేకంగానే చూపించారు. సినిమాలో సినిమాటిక్ కోణాల‌ను ఎక్కువ‌గా తీసేసుకున్నారు. కె సంగీతం, నేప‌థ్య సంగీతం స‌న్నివేశాల‌కు బ‌లాన్నిచ్చాయి. స‌త్య‌న్ సూర్య‌న్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. ఇక న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే.. వై.ఎస్‌.ఆర్‌గా న‌టించిన మమ్ముట్టి చుట్టూనే క‌థ తిరుగుతుంది కాబ‌ట్టి ఆయ‌న్ను ప్ర‌ధానంగా చేసే సినిమాను తెర‌కెక్కించారు. ఆ పాత్ర‌లో మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముట్టి గొప్ప‌గా న‌టించారు. పాత్ర‌కు త‌గ్గ‌ట్టు న్యాయం చేశారు. ఇక కె.వి.పి పాత్ర‌లో న‌టించిన రావు ర‌మేష్‌, వై.ఎస్‌.రాజారెడ్డి పాత్ర‌లో న‌టించిన జ‌గ‌ప‌తిబాబు, విజ‌య‌మ్మ పాత్ర‌ధారి, వై.ఎస్ అనుచ‌రులుగా చేసిన ర‌మేష్‌, మ‌హేష్‌,  హై క‌మాండ్ ప్ర‌తినిధిగా స‌చిన్ ఖేడేక‌ర్‌, కేశ‌వ‌రెడ్డిగా వినోద్‌కుమార్‌, హ‌నుమంత‌రావుగా తోట‌ప‌ల్లి మ‌ధు, స‌బితా ఇంద్రారెడ్డిగా సుహాసిని, అన‌సూయ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల ప‌రిధుల మేర చ‌క్క‌గా న‌టించారు. అయితే సినిమాలో రాజ‌కీయ కోణంలోనే ఎక్కువ‌గా సాగింది. మ‌రి యూత్ ప్రేక్ష‌కుల‌ను సినిమా ఏ మేర ఆక‌ట్టుకుంటుందో చూడాలి.
బోట‌మ్ లైన్‌:   రాజ‌కీయ కోణంలో సాగే.. యాత్ర‌
రేటింగ్‌:2.5/5
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article