YCP Government About Amaravathi Insider Trading
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్ . రాజధాని ప్రాంతం అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు అసెంబ్లీ తీర్మానం చేసింది.. సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు హోంమంత్రి సుచరిత. టీడీపీ హయాంలో అమరావతి ప్రాంతంలో టీడీపీ మంత్రులు, నేతలు, వారి బినామీలు భూములు కొనుగోలు చేసిన తర్వాతేరాజధానిగా అమరావతిని ప్రకటించారని వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని తెలిపిన హోం మంత్రి సుచరిత దీనిపై సమగ్ర విచారణ చేయిస్తామని ప్రకటించారు. ఇక, ఇన్సైడర్ ట్రేడింగ్‌పై అసెంబ్లీలో చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా సభలో మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి రాజధాని ప్రాంతంలో 4070 ఎకరాల ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని తెలిపారు అయితే, ఇన్సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరిపి దీనికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని వ్యాఖ్యానించారు శ్రీకాంత్ రెడ్డి.