పవన్  వ్యాఖ్యలపై  విరుచుకుపడిన వైసీపీ నేతలు

142
YCP Tries To Close Entire TDP
YCP Tries To Close Entire TDP

YCP Leaders Fire On Pawan Kalyam

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా వ్యాఖ్యలు చేస్తున్నారు. విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇటీవల ఏపీలో నెలకొన్న పరిస్థితుల నేపధ్యంలో ఆయన టార్గెట్ జగన్ అంటున్నారు. తెలుగు భాష, హిందుత్వం, కులం అంశాలపై  సీఎం జగన్ రెడ్డి అంటూ పవన్ చేసిన కామెంట్స్ రాజకీయ వాతావరణాన్ని  వేడెక్కించాయి. ఇక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలను తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రులు ఇప్పటికే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై విరుచుకుపడుతున్నారు. ఎమ్మెల్యే కూడా కాని వ్యక్తి మాట్లాడితే తాము పట్టించుకునేది లేదంటూ పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో ఓడిపోయాడని, దాన్ని పదే పదే గుర్తు చేస్తున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు.
గత ఎన్నికల్లో భీమవరం నుండి, గాజువాక నుండి రెండు స్థానాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘోర ఓటమి పాలైన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పై ఆయన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఓటమిని గుర్తు చేస్తూ వైసిపి నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి కనీస ఎమ్మెల్యేగా కూడా గెలవలేక పోయారని  పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఎద్దేవా చేస్తున్నారు. ఇవి జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఒకింత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ  ఆయన మాత్రం   జగన్ పై  వాగ్బాణాలు సంధిస్తూనే ఉన్నారు.

ఇక తాజాగా ఇదే విషయంపై వైసీపీ మంత్రులు సుచరిత, కొడాలి నానీ తదితరులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక్క సారి కూడా ఎమ్మెల్యే కాని వాళ్ళు విమర్శలు చేస్తే ఎవరు పట్టించుకుంటారు అంటూ వ్యాఖ్యానించారు. ఇక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదేపనిగా క్లాస్ చెప్పకుండా పవన్ కళ్యాణ్ కు గట్టి ఝలక్ ఇచ్చారు. రెండే రెండు ముక్కలలో పవన్  కళ్యాణ్ పరువును గంగలో కలిపారు  చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. పవన్ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన తాను రెండు  సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఎమ్మెల్యేగా ఓడిపోయాడని, రెండుసార్లు గెలిచిన తాను, రెండుసార్లు ఓడిపోయిన పవన్ కళ్యాణ్ మీద  మాట్లాడడం ఏంటి? అయినా ఓడిన వాని గురించి  ఏం మాట్లాడాలి సారీ అంటూ  చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి  పవన్ కు గట్టిగా రివర్స్ పంచ్ ఇచ్చారు.
tags : Pawan Kalyan, Janasena Party, YCP, Kodali Nani, Sucharitha, Ministers, Chevireddy Bhaskar Reddy, Cm Jagan

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here