ఆ మంత్రులపై కేసులు..కారణమిదే..

Ycp Ministers Insulted Comments on Ap Council

రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై చర్చ, ఓటింగ్ సందర్భంగా ఏపీ శాసన మండలిలో నెలకొన్న టెన్షన్ అందరికీ తెలిసిందే .  ఈ సమయంలో వైసీపీ సభ్యులు, మంత్రులు మండలి ఛైర్మన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది . ఈ నేపథ్యంలో టీడీపీ నేత, మైనార్టీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మహ్మద్ హిదాయత్ గుంటూరు అర్బన్ ఎస్పీ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చారు. మంత్రులు బొత్స, కొడాలి నాని, అనిల్‌కుమార్ యాదవ్‌లు గౌరవ పదవిలో ఉన్న మహ్మద్ షరీఫ్‌‌పై మతపరమైన దూషణలు చేయడం యావత్ ముస్లింలందరిని అవమానపరిచినట్లుగా ఉందని లిఖితపూర్వక ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రులు సమాజం తలదించుకునేలా దుర్భాషలాడటం సిగ్గుచేటని మైనార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మైనార్టీలను అణచివేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ముస్లింల అస్థిత్వానికి వ్యతిరేకంగా ఉన్న సీఏఏకు పార్లమెంట్‌లో విప్ జారీ చేసి మరీ మద్దతు ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం పట్ల వివిధ ముస్లిం సంఘాలు వ్యతిరేకతతో ఉన్నట్లు తెలిపారు. ఇక ఈ ఫిర్యాదుకు  సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్‌ను కూడా ఆయన పోలీసులకు సమర్పించారు.  సాక్షాధారాలను పరిశీలించిన పోలీసులు మంత్రులపై కేసుల నమోదు దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

Ycp Ministers Insulted Comments on Ap Council,AP council ,  capital decentralization bill, ycp ministers , minorities , chairman shareef , police complaint , 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *