ఆ ప్రాంతం అభివృద్ధి చెందడం  బాబుకు ఇష్టం లేదా?

YCP MLA Amarnath Fires On Chandrababu

ఉత్తరాంధ్ర ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని అన్నారు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌. నేడు అయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. చంద్రబాబుకు వెన్నుపోటు పొడవడం అలవాటుగా మారిందన్న ఆయన ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందడం చంద్రబాబుకు ఇష్టం లేదని చెప్పారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల అంశంపై అయన ఓ క్లారిటీ ఇచ్చారు. అమరావతి నుండి రాజధానిని తరలిస్తామని వైసీపీ ప్రభుత్వం ఎక్కడ కూడా చెప్పలేదని ఈ విషయంలో ప్రజల్ని బాబు తప్పుదోవపట్టిస్తున్నారన్నారు. ఇకపోతే ఆంధ్రప్రాంతంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చెయ్యడమే లక్ష్యంగా వైస్ జగన్మోహన రెడ్డి పని చేస్తున్నారన్నారు అమర్‌నాథ్‌. ఇక సీఎం జగన్ పై అనవసర విమర్శలకు పాల్పడుతున్నట్లు అయన పేర్కొన్నారు. ఈ మేరకు చంద్రబాబు గందరగోళం సృష్టించేందుకు తనకు అనుకూలంగా ఉన్న మీడియాని ఉపయోగించుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్‌లో రాజధాని ఉంటే బాధ పడ్డామా.. అసలు విశాఖ అంటే ఎందుకంత ద్వేషం అని చంద్రబాబును ప్రశ్నించారు ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌.

YCP MLA Amarnath Fires On Chandrababu,Chandrababu,AP 3 Capitals,Vishaka,Amaravati,CM YS Jagan,Babu Unlike Developing, AP Political News

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article