గ్రామ వాలంటీర్ల దందాపై వైసీపీ ఫైర్…

200
YCP MLA comments on Volunteers
YCP MLA comments on Volunteers

YCP MLA comments on Volunteers

ఏపీలో గ్రామాల అభివృద్ధికి పట్టం కట్టటం కోసం, క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చెయ్యటం కోసం  గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ గ్రామ వాలంటీర్లపై మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సంచలన ఆరోపణలు  చెయ్యటం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది . గ్రామ వాలంటీర్లు చాలా మంది పేదల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ  వాటిని నేతలకు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇష్టం లేకుంటే ఉద్యోగం వదిలి వెళ్లిపోవాలని.. డబ్బులు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.

అయితే ప్రభుత్వ పథకాలను ప్రజల గడప వద్దకే చేర్చేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రతి 50 ఇళ్లకు ఒక్కొక్కరి చొప్పున.. మొత్తం 4లక్షల మంది గ్రామ వాలంటీర్లుగా ఎంపికయ్యారు. వీరికి ప్రభుత్వం నెలకు రూ.5వేల గౌరవ వేతనం కూడా అందిస్తోంది. కానీ కొందరు వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను పొందే లబ్దిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ఇలాంటి ఆరోపణల క్రమంలోనే కొంతమందిని వాలంటీర్లుగా తప్పించారు కూడా. కానీ ఇప్పుడు వారు వసూలు చేసే డబ్బులు నేతలకు ఇస్తున్నారంటూ సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం రాజకీయంగా దుమారం  రేపుతోంది.

YCP MLA comments on Volunteers,YSRCP, MLA Bala Nagi Reddy, YS Jagan Mohan Reddy,#villagevolunteer

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here