బడ్జెట్ సమావేశాలపై వైసీపీ టీడీపీ వ్యూహాలు

YCP Vs TDP in AP Assembly Budget Session 2020

ఈసారి ఏపీ బడ్జెట్ సమావేశాలు ఆసక్తికరంగా మారనున్నాయి.  బడ్జెట్ సమావేశాల్లో కేవలం అసెంబ్లీని మాత్రమే సమావేశపరచాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మండలి సమావేశాలు లేకుండా కేవలం అసెంబ్లీని సమావేశాపరిస్తే కోర్టును ఆశ్రయించాలని టీడీపీ భావిస్తుంది. నిబంధనల ప్రకారం మండలి రద్దుకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసే వరకూ మండలి సమావేశపరచాల్సిందే. కానీ సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ కేవలం అసెంబ్లీ సమావేశాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో మూడు రాజధానులకు ఉద్దేశించిన రెండు కీలక బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపడం ద్వారా అడ్డుకున్న శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఇప్పుడు ఈ తీర్మానాన్ని కేంద్రం ఈసారి బడ్జెట్ సమావేశాల్లో బిల్లు రూపంలో తీసుకొస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. కేంద్ర బడ్జెట్ రెండు విడతల సమావేశాల మధ్య గ్యాప్ లో సీఎం జగన్ ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు.

అదే సమయంలో న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నూ కలుసుకున్నారు. ఈ భేటీల్లో ఏపీ శాసనమండలి రద్దే ప్రధాన అజెండా అయింది.కానీ  జగన్ ప్రతిపాదనకు కేంద్రం ఏం చేస్తుందనేది తెలియాల్సి ఉంది. అదే జరిగితే జగన్ కు లైన్ క్లియర్ అయినట్లే. బీజేపీ పెద్దల నుంచి అందిన హామీ మేరకే పార్లమెంటులో మండలి రద్దు బిల్లు పెట్టే వరకూ ఆగి ఆ తర్వాత అసెంబ్లీపై నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందన్న అంశాన్ని కూడా వైసీపీ అధిష్టానం తీవ్రంగా పరిశీలిస్తోంది. ఏపీ శాసనమండలి రద్దుపై ఇప్పటివరకూ జరుగుతున్న ప్రచారం మేరకు కేంద్రం ఈసారి బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లు పెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే బిల్లు పెట్టకపోతే ఏంటన్న చర్చ కూడా వైసీపీలో జరుగుతోంది. కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలే విపక్షాలు ఉభయసభలను స్తంభింపజేస్తున్నాయి. ఇదే పరిస్దితి కొనసాగితే ఏపీ మండలి రద్దు వంటి కీలక బిల్లులను ఆమోదించే పరిస్ధితి ఉండదు. అప్పుడు ఏపీ ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయాలేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. అప్పుడు మండలి రద్దు ప్రతిపాదన కేంద్రం ముందున్న కారణంగా సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ ఏపీ ప్రభుత్వం కేవలం అసెంబ్లీని మాత్రమే సమావేశపరిచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక వైసీపీ వ్యూహాని బట్టి టీడీపీ ప్రతి వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటుంది.

YCP Vs TDP in AP Assembly Budget Session 2020,andhra pradesh , ap budget session, assembly , central government , council repeal , jagan mohan reddy , ycp government , ap government

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article