సిల్వర్ ఓక్స్ స్కూల్లో.. ఘనంగా యోగా దినోత్సవం

* 4300 మంది విద్యార్థుల‌తో యోగా
ప్రతి రోజు యోగా చేస్తే విద్యార్థులెంతో ఆరోగ్యంగా ఉంటారని బాచుపల్లి సీఐ నర్సింహారెడ్డి తెలిపారు. మంగళవారం బాచుపల్లిలోని సిల్వర్ ఓక్స్ స్కూల్లో జరిగిన 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో.. దాదాపు పది స్కూళ్లకు చెందిన ఐదు వందల మంది, స్కూలుకు చెందిన 3500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రోజు యోగా చేయడం వల్ల విద్యార్థులు చురుగ్గా ఉంటారని, మెరుగ్గా తయారవుతారని అన్నారు. ఈ సంద‌ర్భంగా సిల్వ‌ర్ ఓక్స్ స్కూల్ ప్రిన్సిప‌ల్ సీతామూర్తి మాట్లాడుతూ.. త‌మ స్కూల్ యాక్టివిటీలో భాగంగా.. ప్రతిరోజూ విద్యార్థులు యోగా చేస్తారని తెలిపారు. వైమానిక దళం కమాండింగ్ ఆఫీసర్ ఎన్ సీసీ గ్రూప్ కెప్టెన్ కేఎం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఎన్ సీసీ విద్యార్థులు తప్పకుండా యోగా చేయాలని, దీని వల్ల శారీరికంగా, మానసికంగా దృఢంగా త‌యార‌వుతార‌ని అన్నారు. ఎన్సీసీ థ‌ర్డ్ ఆఫీస‌ర్ రాజీవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పూర్ణిమా, జ‌య‌ల‌క్ష్మీ త‌దిత‌రులు పాల్గొన్నారు.
పాల్గొన్న స్కూళ్లు ఇవే:
సెయింట్ మార్టిన్స్ హై స్కూల్‌
సీఎంఆర్ స్కూల్
బీఆర్‌జేసీ పార్‌సిస్ స్కూల్
సిల్వ‌ర్ ఓక్స్
కేంద్రీయ విద్యాల‌యా బేగంపేట్
కేంద్రీయ విద్యాల‌యా పికెట్
విజ‌య హై స్కూల్
సుజాత హై స్కూల్
అమీర్ పేట్ ప్ర‌భుత్వ పాఠ‌శాల
షాహినత్ గంజ్ ప్ర‌భుత్వ పాఠ‌శాల
silver oaks school yoga day celebrations
silver oaks school yoga day celebrations

silver oaks school yoga day celebrations

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article