షర్మిలపై అసభ్య ప్రచారం.. యువకుడి అరెస్టు

YOUTH ARRESTED

వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిలపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన కేసులో సైబరాబాద్ పోలీసులు ఓ యువకుడిని అరెస్టు చేశారు. యూట్యూబ్ తోపాటు పలు వెబ్ సైట్లలో షర్మిల గురించి తీవ్ర అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పోస్టులు పెట్టినందుకు ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం వేముల గ్రామానికి చెందిన పెద్దిశెట్టి వెంకటేశ్వరరావును గుంటూరులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని హైదరాబాద్ తీసుకొచ్చారు. ఆదివారం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి అనంతరం రిమాండ్ కు తరలించనున్నట్టు పోలీసులు తెలిపారు. తనపై ఓ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని షర్మిల ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించారు. వెంటనే గుంటూరు వెళ్లి అతడిని అరెస్టు చేశారు. గుంటూరులోని ఆర్ వీఆర్ కాలేజీలో ఎంసీఏ చదువుతున్న వెంకటేశ్వరరావు.. తమ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రెండెకరాల భూమి ఇచ్చిందని చెప్పినట్టు సమాచారం. పూర్తి వివరాలు సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

CRIME NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article