మరో ప్రేమోన్మాదం

YOUTH ATTACKED STUDENT

హైదరాబాద్ లో మరో ప్రేమోన్మాదం చోటుచేసుకుంది. తనను ప్రేమించడంలేదనే కోపంతో ఇంటర్ విద్యార్థినిపై ఓ యువకుడు అమానుషంగా దాడికి తెగబడ్డాడు. కొబ్బరి బొండాలు నరికే కత్తితో ఇష్టమొచ్చినట్టు దాడి చేయడంతో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. హైదరాబాద్ బర్కత్ పురలో బుధవారం ఈ దారుణం జరిగింది. సత్యనగర్ కాలనీకి చెందిన భరత్ అనే యువకుడు తమ ఇంటి పక్కనే ఉంటున్న ఇంటర్ విద్యార్థిని వెంటపడుతున్నాడు. ప్రేమించాలంటూ గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఇది ఇష్టం లేకపోవడం ఆమె ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేసి, భరత్ కు కౌన్సెలింగ్ చేయించారు. అయినా, భరత్‌ తన ధోరణి మార్చుకోలేదు. రెండురోజుల క్రితం అమ్మాయి తల్లికి ఫోన్‌ చేసి బెదిరించాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం కాలేజీకి వెళుతున్న యువతిపై ఒక్కసారిగా దాడి చేశాడు. దీంతో ఆమె మెడ, పొట్టపై తీవ్ర గాయాలు కావడంతో వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. భరత్‌పై వేధింపుల కేసు పెట్టినందునే ఈ దారుణానికి ఒడిగట్టాడని ఆమె కుటుంబసభ్యులు ఆరోపించారు. భరత్‌ తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పినా ఏమాత్రం మార్పు రాలేదని తెలిపారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

CRIME NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article