ఆ వార్తల వీడియోల విషయంలో యూట్యూబ్ సెన్సేషన్

122
YouTube Says It Will Ban Misleading Election-Related Content
YouTube Says It Will Ban Misleading Election-Related Content

YouTube Says It Will Ban Misleading Election-Related Content

సోషల్ మీడియా దిగ్గజం యూట్యూబ్ తప్పుడు వార్తల విషయంలో   సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి నిరాధార వార్తలను అరికడుతామని.. ఎన్నికలకు సంబంధించి తప్పుడు సమాచారం పోస్ట్ చేయడాన్ని నిషేధిస్తున్నట్టు యూట్యూబ్ మాతృసంస్థ గూగుల్ ప్రకటించింది. ఇప్పటికే ఫేస్ బుక్ ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకోగా.. ఇప్పుడు యూట్యూబ్ కూడా అదే బాటలో నడవనుంది. ఏఏ వీడియో వార్తలను నిషేధిస్తామో కూడా విడమర్చి చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు మరణించారని.. ఎన్నికల తేదీలపై తప్పుడు సమాచారం ఎన్నికల ప్రచార వార్తలను యూట్యూబ్ లో పోస్టు చేస్తే దాన్ని తొలగిస్తామని యూట్యూబ్ తెలిపింది.యూట్యూబ్ లో తప్పుడు వార్తలను తొలగించడం.. నిషేధించడానికి కొత్తగా ట్రస్ట్ అండ్ సేఫ్టీ టీములను ఏర్పాటు చేశామని యూట్యూబ్ తెలిపింది. వీరు వీడియోలను నిరంతరం పరిశీలించి నకిలీ వార్తలను నమ్మశక్యం కానీ వీడియోలను యూట్యూబ్ నుండి  తొలగిస్తారని తెలిపింది.యూట్యూబ్ ను విశ్వసనీయత గల సంస్థగా మార్చేందుకు తప్పుడు వీడియోలు సమాచారాన్ని తొలగించనున్నట్టు యూట్యూబ్ తెలిపింది. ఈ మేరకు ప్రైవసీ పాలసీ మార్చినట్టు ప్రకటించింది.

YouTube Says It Will Ban Misleading Election-Related Content,social media, youtube , fake news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here