పోలవరం రివర్స్ టెండరింగ్?

YS JAGAN DECIDES FOR POLAVARAM REVERSE TENDER

పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ విషయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, జైన్ సూచనలు బేఖాతరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. . ఆగస్టు 17 న అంటే నేడు తేదీన పోలవరం ప్రాజెక్టు పనుల రివర్స్ టెండరింగ్ కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రాజెక్టు పనులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని పోలవరం ప్రాజెక్టు అధారిటీ సీఈవో చెప్పినప్పటికీ ఆయన చెప్పిన అంశాలను లెక్క చెయ్యకుండా ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ముందడుగు వేయాలని భావిస్తున్నారు జగన్. అయినా సరే పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ సి ఈ వో గా ఉన్న ఆర్కే జైన్ మరోమారు ప్రభుత్వాన్ని ఆలోచన విరమించుకోవాలని సూచిస్తూ లేఖ రాశారు.

* ఏపీ రాష్ట్ర నీటి పారుదల శాఖాధికారి ఆదిత్యనాథ్ దాస్ కు పీపీఏ సీఈఓ ఆర్ కే జైన్ లేఖ రాశారు.ఈ నెల 13వ తేదీన హైద్రాబాద్ లో సమావేశమైన పోలవరం ప్రాజెక్టు అథారిటీ రివర్స్ టెండరింగ్ నష్టాన్ని చేకూరుస్తుందని చెప్పిందని , ప్రాజెక్టు త్వరగా పూర్తి కావాలంటే రివర్స్ టెండరింగ్ వద్దని పీపీఏ సూచించింది.ఇక అలాగే ప్రాజెక్టు విస్తృత ప్రయోజనాల మేరకు రీ టెండరింగ్ విధానాన్ని మానుకోవాలని సలహా ఇస్తున్నట్టుగా ఆ లేఖలో పీపీఏ సీఈఓ కోరారు. కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఒక నిర్ణయం తీసుకునే వరకైనా రివర్స్ టెండరింగ్ విధానాన్ని నిలిపివెయ్యాలని ఆయన లేఖలో కోరారు. రివర్స్ టెండరింగ్ విధానం వల్ల ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన లేఖలో అభిప్రాయపడ్డారు. మరి ఈ రోజు రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చెయ్యాలని భావిస్తున్న నేపధ్యంలో పీపీఏ సిఈ ఓ జైన్ లేఖ రాయటం ప్రభుత్వ వర్గాలను ఆలోచనలో పడేసింది. శుక్రవారం ఈ లేఖ అందిన నేపధ్యంలో ఈ రోజు రీ టెండరింగ్ విషయంలో జగన్ సర్కార్ ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

KCR Collector meet

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *