ఢిల్లీ స్థాయిలో జగన్ పోరు షురూ

YS JAGAN IN DELHI

  • చంద్రబాబుపై ఈసీకి ఫిర్యాదు
  • ముగ్గురు అధికారులను బదిలీ చేయాలని వినతి

తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహాన్ రెడ్డి పోరు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలో జరుగుతున్న అవకతవకలు తదితర అంశాలపై ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదుల పరంపర షురూ చేశారు. ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరగాలంటే డీజీపీ ఠాకుర్‌, ఇంటెలిజెన్స్‌ ఐజీ వెంకటేశ్వర రావు, డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ రావులను వెంటనే బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. సోమవారం జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్ సీపీ నేతల బృందం కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) సునీల్‌ అరోరాను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న దురాగతాలను ఆధారాలతో సహా ఈసీకి వివరించినట్టు చెప్పారు. ఓటర్ల జాబితాలో ఏ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నారో తెలియజేసినట్టు చెప్పారు. ‘మొత్తం 3 కోట్ల 69 లక్షల ఓట్లలో 59 లక్షల మంది నకిలీ ఓట్లున్నాయి. సర్వేల పేరుతో వివరాలు తెలుసుకుని వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారు. ఇప్పటికే 4 లక్షల ఓట్లను ఇలా తొలగించారు. ఈ విషయాలన్నిటినీ ఆధారాలతో సహా ఈసీ దృష్టికి తీసుకెళ్లాం. ఇక చంద్రబాబు పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. సొంత సామాజిక వర్గానికి చెందిన 35 మందికి డీఎస్పీగా ప్రమోషన్లు ఇచ్చారు. ఎప్పుడూ లేని విధంగా డీఐజీ లా అండ్‌ ఆర్డర్‌ పోస్ట్‌ క్రియేట్‌ చేసి చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఘట్టమనేని శ్రీనివాస్‌ రావును నియమించారు. తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను కీలక పోస్టుల్లో ఉంచి ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే డీజీపీ ఠాకూర్‌, ఇంటెలిజెన్స్‌ ఐజీ వెంకటేశ్వరరావు, డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ రావును బదిలీ చేయాలని ఈసీని కోరాం’ అని జగన్ తెలిపారు.

ఇక ఈవీఎంలపై చంద్రబాబు వ్యక్తంచేస్తున్న అనుమానాలను జగన్ తోసిపుచ్చారు. ‘ఇదే చంద్రబాబు 2014 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క శాతం ఓట్లతో మాపై గెలిచాడు. అప్పుడు కూడా ఈవీఎంలు ట్యాంపర్‌ జరిగాయా? మేం అలా అనుకోవాలా? మొన్న నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో మూడింట్లో బీజేపీ ఓడిపోయింది. నిజంగా ట్యాంపరింగ్‌ అవకాశం ఉంటే అక్కడ బీజేపీ అధికారం కాపాడుకుని ఉండేది కదా? ఎలాగూ ఓడిపోతాం కదా అనీ చంద్రబాబు లాజిక్‌ లేకుండా మాట్లాడుతున్నారు’ అని జగన్‌ దుయ్యబట్టారు.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article