వైసీపీ అధినేత జగన్ నూతన గృహప్రవేశం వాయిదా

YS JAGAN NEWHOUSE OPENING WAS POSTPONED

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నూతన గృహప్రవేశం వాయిదా పడింది. 14వ తేదీన గృహ ప్రవేశం చేయాలని భావించి అందరికీ ఆహ్వానాలు పంపిన జగన్ సడన్ గా గృహ ప్రవేశాన్ని వాయిదా వేసుకున్నారు.
ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంట జరగాల్సిన శుభకార్యం వాయిదా పడింది. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న జగన్ ఏపీ రాజధాని అమరావతిలో ఇంటిని నిర్మించుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి కొత్తింటికి చేరటం ద్వారా.. అక్కడి నుంచే పార్టీ కార్యకలాపాల్ని నిర్వహించాలని ఆయన భావిస్తున్నారు.
ఇందులో భాగంగా నిర్మించిన కొత్తింటి గృహప్రవేశం కార్యక్రమాన్ని ఈ నెల 14న చేపట్టాలని భావించారు. ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్యుల్ని జగన్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. అందులో భాగంగా తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించటం.. అందుకు ఆయన ఓకే అనటం జరిగింది. అయితే.. ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమం వాయిదా పడినట్లుగా పార్టీ సీనియర్ నేత సుబ్బారెడ్డి వెల్లడించారు.
జగన్ సోదరి షర్మిల.. ఆమె భర్త అనిల్ ఇద్దరి ఆరోగ్యం సరిగా లేదని.. జ్వరంతో బాధ పడుతున్న నేపథ్యంలో గృహ ప్రవేశకార్యక్రమాన్ని నిరవధికంగా వాయిదా వేసినట్లుగా పేర్కొన్నారు. దీనిపై మరింత మాట్లాడేందుకు జగన్ ఇష్టపడటం లేదని తెలిసిందే. మళ్లీ గృహప్రవేశ కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహిస్తారన్న విషయంపై ప్రకటన విడుదల చేస్తారని సుబ్బారెడ్డి వెల్లడించారు. ఏపీలో రాజకీయం వేడెక్కిన సమయంలో ఏపీ లోనే ఉండి అటు పార్టీ శ్రేణులకు ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పిన జగన్ గృహప్రవేశ కార్యక్రమాన్ని వాయిదా వేయడానికి ప్రకటించిన కారణం చాలా చిన్న కారణమని, కానీ దీని వెనక బలమైన కారణమే ఉండి ఉంటుందని భావిస్తున్నారు.

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article