వైయస్‌ జగన్‌ మకర సంక్రాంతి శుభాకాంక్షలు

29

మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మనవైన… అచ్చ తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు, సొంత గ్రామాల మీద మమకారానికి, రైతులకు, వ్యవసాయానికి మనమంతా ఇచ్చే గౌరవానికి, తెలుగువారికంటూ ప్రత్యేకమైన కళలకు సంక్రాంతి పండుగ ప్రతీక అని ముఖ్యమంత్రి అన్నారు.

భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్ళు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో సంక్రాంతి శోభను తీసుకు వచ్చాయని; భోగి.. సంక్రాంతి.. కనుమ పండుగలను ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి అభిలషించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here