వైఎస్సార్ దేవుడైతే ..కేసీఆర్ దెయ్యం

వైరా:ఖమ్మం జిల్లా వైరా నియోజక వర్గంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడారు. వైఎస్సార్ పాలన తో పోలిస్తే కేసీఆర్ పాలన నక్క కు నాగలోకం ఉన్నంత తేడా ఉంది. పోచమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసినట్లు ఉంది కేసీఆర్ తీరు. వైఎస్సార్ దేవుడైతే ..కేసీఆర్ దెయ్యం. దేవుడికి దయ్యానికి… ఉన్నంత తేడా ఉంది పరిపాలన అని అన్నారు.
వైఎస్సార్ పాలన తో పోలిస్తే కేసీఆర్ పాలన ఆకాశానికి భూమికి ఉన్నంత దూరం ఉంటుంది. వైఎస్సార్ హయాంలో ఒక్క సారి కూడా ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదు. ఛార్జీలు పెంచకుండా ఆర్టీసీని ఆదుకున్న ఘనత వైఎస్సార్ ది. కేసీఆర్ పరిపాలన లో ప్రయాణికుల నడ్డి విరుస్తున్నారు. ఛార్జీలు చూస్తే భయంకరంగా ఉన్నాయి. ఛార్జీలు పెంచి ప్రజలపై పెను భారం మోపుతున్నారని ఆరోపించారు.
ఆర్టీసీ చార్జీలే కాదు… ఏవీ చూసినా అన్ని మోతే. అన్ని వర్గాలను మోసం చేసిన మోస గాడు కేసీఆర్. ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. మాట తప్పని మడమ తిప్పని వ్యక్తి వైఎస్సార్ అని అన్నారు.
మాట ఇచ్చాడు అంటే వైఎస్ఆర్ చేసి చూపించాడు. మన ప్రభుత్వం వచ్చాక…అది మీ ప్రభుత్వం. వైఎస్సార్ పథకాలు అన్ని అమలు చేసుకుందాం. మహిళలకు ఆర్థికంగా పెద్ద పీట వేద్దాం. ఇది బంగారు తెలంగాణ కాదు..బ్రతుకు లేని తెలంగాణ అని విమర్శించారు.
ఇది అప్పుల తెలంగాణ..ఆత్మహత్యల తెలంగాణ. వైఎస్సార్ హయాంలో 46 లక్షల కుటుంబాలకు పక్కా ఇల్లులు ఇచ్చారు. కేసీఆర్ పాలన లో ప్రజల ఆస్థులు పెరగక పోగా..అప్పుల పాలు అయ్యారని అన్నారు.
వైఎస్సార్ హయాంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. కేసీఆర్ ను ప్రశ్నించే ప్రతిపక్షాలు నిద్ర పోయాయి. అందుకే పార్టీ పెట్టాం… ప్రజల తరుపున పోరాడుతున్నం. ఇక్కడ ఉన్నది పులి బిడ్డ… పులి బిడ్డగా మాట ఇస్తున్నా. వైఎస్సార్ సంక్షేమ తెలంగాణ అంటే ఎంటో చూపిస్తానని ఆమె అన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article