చిన్న దొర‌గారికి కోపం వ‌చ్చింది!

మంత్రి కేటీఆర్ పై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్య‌క్తం చేసింది. కేటీఆర్ కి తాను పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం నచ్చలేద‌ని.. ఆయన టీం కి అసలే నచ్చలేద‌ని అందుకే త‌న మీద వ్యక్తిగతంగా సామాజిక మాధ్యమాల్లో వికృతంగా దాడి చేశారని ఆరోపించింది. మంచి చెడూ… ఉచ్ఛం..నీచం అన్ని మరిచారని.. చిన్న దొరగారు మీకు అసలు ఎందుకు కోపం వచ్చిందని ఎదురుదాడికి తిరిగింది. మీ బాధ్య‌తలు గుర్తు చేసినందుకు కోపం వచ్చిందా? ఫీజ్ రీఎంబర్స్ మెంట్ అందక మీకు ఒక వీడియో పెడితే కోపం వచ్చిందా? అని నిల‌దీసింది. పుట్టిన రోజు అయితే ఎంటి గొప్ప…అందరూ పుడతారు.. పుట్టడం గొప్ప కాదు…ప్రజలకు సేవ చేయడం గొప్ప అని అభిప్రాయ‌ప‌డింది. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోవడం గొప్ప అని తెలియ‌జేసింది. వైఎస్సార్ని చూసి పెద్ద దొర, చిన్న దొర నేర్చుకోవాలి. ప్రశ్నించకపోతే తప్పు మాది…ప్రశ్నిస్తే తప్పు ఎలా అవుతుందని అడిగింది. మీ బాధ్యత గుర్తు చేస్తే అంత కోపంవస్తె….విస్మరిస్తే ప్రజలకు ఎంత కోపం రావాలని నిల‌దీసింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article