తెలంగాణను బానిస చేసిన కల్వకుంట్ల ఫ్యామిలీ

సింహం సింగిల్ గానే వ‌స్తుంది.. తెలంగాణ ప్ర‌జ‌ల సంక్షేమం కోస‌మే వ‌స్తున్నా.. ఇక్క‌డి ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల కోస‌మే పోరాటం చేస్తా.. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఎక్క‌డ అవ‌స‌ర‌మైతే.. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల మేర‌కే ప‌ని చేస్తా.. మాట మీద నిల‌బ‌డే రాజ‌న్న బిడ్డ‌గా చెబుతున్నా.. తెలంగాణ‌కు ద‌క్కాల్సిన ఒక్క చుక్క నీటి బొట్టు కూడా వ‌ద‌ల‌ను.. తెలంగాణ‌కు అన్యాయం జ‌రిగే ఏ ప్రాజెక్టునైనా అడ్డుకుంటా.. తెలంగాణ ప్ర‌జ‌ల కోసం, యువ‌త కోసం, నిరుద్యోగుల కోసం, బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల క్షేమం కోసం, గిరిజ‌నుల పోడు భూముల కోసం, బీసీల స‌మాన ప్రాతినిధ్యం కోసం నిల‌బ‌డ‌తా.. కొట్లాడ‌తా..

క‌ల్వ‌కుంట ఫ్యామిలీ తెలంగాణ రాష్ట్రాన్ని బానిస‌గా చేసింద‌ని వైఎస్ ష‌ర్మిల విమ‌ర్శించారు. ఖ‌మ్మం సంక‌ల్ప స‌భ‌లో ఆమె అధికార పార్టీని దుయ్య‌బ‌ట్టారు. సీఎం కేసీఆర్ దొర త‌ర‌హాలో పాల‌న చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ప్ర‌శ్నించ‌డానికే త‌మ పార్టీ అవ‌స‌ర‌మంటూ ఎలుగెత్తి చాటారు. డ‌బుల్ బెడ్‌రూములు ఎన్ని క‌ట్టార‌ని ప్ర‌శ్నించారు. విద్యార్థుల‌కు ఫీజు రీఇంబ‌ర్స్‌మెంట్ ఏమైందంటూ అడిగారు. నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు ఏమ‌య్యాయ‌ని కేసీఆర్ సారూ అంటు ప్ర‌శ్నించారు. ముస్లీం రిజ‌ర్వేష‌న్లు ఏమ‌య్యాయి సీఎం సారు అంటూ నిల‌దీశారు. ద‌ళితుల‌కు మూడు ఎక‌రాల భూమి ఏమైంది సీఎం సారూ అంటు కేసీఆర్‌కు చుర‌క‌లంటించారు. తన తండ్రి వైఎస్సార్ పేద వాళ్ల‌కు కార్పొరేట్ ఆస్ప‌త్రిలో చికిత్స అందించారని గుర్తు చేశారు. అస‌లు వైస్సార్ పాలనకు‌, కేసీఆర్ పాలనకు పోలికే లేద‌న్నారు. కులాల‌కు, మ‌తాల‌కు, ప్రాంతాల‌కు అతీతంగా అన్ని వ‌ర్గాల‌కు సంక్షేమ‌ఫ‌లాల్ని అందించారు వైఎస్సార్ అంటూ గుర్తు చేశారు. ప్ర‌తిరోజూ ప్ర‌జా ద‌ర్బార్ నిర్వ‌హించి వంద‌లాది మందిని క‌లిసి, వారి స‌మ‌స్య‌ల్ని తెలుసుకుని ప‌రిష్క‌రించేవారు. రాష్ట్రానికి గుండెకాయ లాంటి స‌చివాలయంలోకి అడుగుపెట్ట‌ని సీఎం ఎవ‌రైనా ఉన్నారా? అంటే ఈ దేశంలో కేసీఆరే ఒక్కరేనని చుర‌క‌లంటించారు. నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు దొరుకుతున్నాయా? చేనేత‌ల త‌ల‌రాతి మారిందా? కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి ఆలోచిస్తున్నారా?

తెలంగాణ ఉద్య‌మాన్ని మ‌న‌సారా గౌర‌విస్తున్నాం. అమ‌రులైన అంద‌రికీ నా జోహార్లు.. వారి ప్రాణం పోకుండా తెలంగాణ వ‌చ్చి ఉంటే బాగుండేది. ఆరువేల మంది రైతులు తెలంగాణ‌లో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న‌ది. దేశంలోనే రెండో స్థానంలో ఉన్న‌ది. యువ‌కులు నోటిఫికేష‌న్ కోసం ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు. న‌డిరోడ్డు మీద లాయ‌ర్ల‌ను కిరాత‌కంగా హ‌త్య చేస్తే చ‌ర్య లేదు. ప్రాణాల‌కు విలువేది? గిరిజ‌న మ‌హిళ పోడు భూమి కోసం గొడ‌వ ప‌డుతుంద‌ని బ‌ట్ట‌లూడ‌తీసి కొట్టారు. అయినా, పాల‌కులు ఎవ‌రూ స్పందించ‌లేదు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీచ‌ర్ల‌ను బెదిరించి ఓట్లు వేయించుకున్నారు. నీళ్లు, నిధులు, నియామ‌కాలు ఎక్క‌డ అంటూ ప్ర‌శ్నించారు. స్వ‌రాష్ట్ర ఫ‌లాలు ప్ర‌గ‌తి భ‌వ‌న్ గేటు దాటికి సామాన్యులకు ఎక్క‌డికి చేరుతున్నాయి? ‌తెలంగాణ రాష్ట్రంలో అంతా భ‌జ‌న బ్యాచే అంటూ ఎద్దేవా చేశారు. ఉద్య‌మ నాయ‌కుడు ప‌గ్గాలు చేప‌డితే అన్నివ‌ర్గాలు అభివృద్ధి చెందుతాయ‌ని అనుకున్నారు. త‌ప్పు చేస్తే ముక్కు నేల‌కు రాస్తాన‌ని కేసీఆర్ అన్నారు.. కానీ, అన్నివ‌ర్గాల‌కు న్యాయం జ‌రిగిందా? అంటూ ప్ర‌శ్నించారు. క‌ల్వ‌కుంట ఫ్యామిలికీ తెలంగాణ బానిస అయ్యిందా? దొర గారు ద‌య‌తలిస్తే తీసుకోవాలి.. దొర చెప్పిందే వేదం.. దొర నంది అంటే నంది.. పంది అంటే పంది.. దొర బాంచెన్ అంటూ సాగిల‌పడాలి.. ఓడ దాటాక ఓడ మ‌ల్ల‌న్న ఓడ దాటాక బోడ మ‌ల్ల‌న్న అన్న చందంగా కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. నిల‌బెట్టుకోలేని హామీల గురించి కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిప‌క్షం హోదాలో ఉండి పోరాడ‌టం లేద‌ని విరుచుకుప‌డ్డారు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కు అమ్ముడుపోయింద‌న్నారు.

SourceTSNEWS
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article