పెద్దమొగోడు కదా కేటీఆర్?

వైఎస్ తెలంగాణకు వ్యతిరేకి కాదని షర్మిల స్పష్టం చేశారు. 2000 లో 41 మంది ఎమ్మెల్యే లతో సంతకాలు పెట్టించారన్నారు. 2004, 2009 యూపీఏ మ్యానిపెస్టో లో పెట్టించారని తెలిపారు. తెలంగాణ వెనుకబాటుకు తగ్గించేందుకు కృషి చేశారని గుర్తు చేశారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నంతకాలం ఎవరు భయపడలేదని.. ఆయన చనిపోయాకే శ్రీకాంత చారి ఆత్మహత్య చేసుకున్నారు ఆ తర్వాతే మలిదశ ఉద్యమం జరిగిందని గుర్తు చేశారు. ఇంకా, ఆమె ఏమన్నారంటే..

‘‘ వైఎస్ఆర్ తెలంగాణ కు వ్యతిరేకి అవునా కదా అని గ్రామాల్లోకి వెళ్లి తెలుసుకోండి. మంచి చేసారా లేదా ఎంతమందికి అయన పథకాల తో లబ్ది పొందారు. తెలంగాణకు వ్యతిరేకమని ఎప్పుడు చెప్పలేదు. అందరితో చర్చించే తెలంగాణ ఇవ్వాలని చెప్పారు. కావాలంటే రికార్డులు చూసుకోండి. ఆంధ్రవాళ్లను వెళ్ళగొడతాం, ఆస్తులు కొల్లగొడతామంటేనే ఆ మాటలు వచ్చాయని గుర్తుంచుకోవాలి. తెలంగాణ నా గడ్డ, ఇక్కడి ప్రజలకు మేలు చేసేందుకే పార్టీ.. పుట్టింటిపై అలిగితే పార్టీలు పెట్టారు.. ఎవరి మీదనో అలిగి పెట్టింది కాదు. ఈపార్టీ తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడేందుకే పార్టీ. పార్టీ పేరులోనే వైస్సార్ ఉన్నారు, అవమానించేవారు ఆలోచించుకోవాలి. ఎందుకు తెలంగాణాలో పార్టీ పెట్టకూడదు?

ఎస్సి, ఎస్టీల మానప్రాణాలకు రక్షణ ఉందా? తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరు. అందుకే, ఇప్పుడు పెట్టాల్సిన అవసరం ఉంది. మీటింగ్ లకు వెళ్లే బాధ్యత కెసిఆర్ కు లేదా? అని ప్రశ్నించారు. కేంద్రం గెజిట్ విడుదలలో కేసీఆర్ తప్పులేదా? కృష్ణా, గోదావరి తెలంగాణ నీటి బొట్టును వదులుకోం.. ఇతర ప్రాంతలవి ఆపనే ఆపం. రాజన్న రాజ్యం కావాలా రాక్షస పాలనా కావాలా అనేది ప్రజల నిర్ణయం. ఏపీలో రాజన్న రాజ్య స్థాపన జరుగుతున్నట్లే అనిపిస్తుంది. ప్రజలే అల్టిమేట్ నిర్ణేతలు. పాలనా నచ్చకపోతే వారే జవాబు చెప్తారు. కేటీఆర్ ఎవరు, కేసీఆర్ గారి కొడుకా? కేసీఆర్ మహిళలను గౌరవించరు, అలాంటిది అయన కొడుకు మహిళను గౌరవిస్తారని ఎలా అనుకుంటాను? మహిళలను ఎంతమందిని నిలబెట్టారు, ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు, ఇచ్చిన వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇచ్చారా? ఆడవాళ్లంటే వంటింటికే పరిమితం అవ్వాలనేదే కేటీఆర్ ఉద్దేశ్యమా అని ప్రశ్నించారు. పెద్దమొగోడు కదా కేటీఆర్ అధికారంలో ఉంది ఏం చేస్తున్నారని నిలదీశారు. 3 లక్షల 80 ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది, ఇస్తే నా వ్రతం విజయవంతమైందని నేను అనుకుంట, పెద్ద మొగోడు కదా ఆ పని చేసి చూపించమనండి అని ప్రశ్నించారు. కాంగ్రెస్ టీఆరెస్కు అమ్ముడుపోయిందని బాంబు పేల్చారు.

కేసీఆర్ ఒక డిక్టేటర్.. మేమె తెలంగాణాలో ప్రతిపక్షం.. ప్రశ్నించేవాడు ఉండద్దనేది కేసీఆర్ లక్ష్యం.. నీటి సమస్యల పరిష్కారంలో ఏడేళ్ల పాలనలో కెసిఆర్ విఫలం అయ్యారు. రాజకీయం కోసమే వాటర్ ఇష్యూస్ ని ఎత్తుకుంటున్నారు. కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి ని సీఎం చేయలేదు. 2004 కంటే ముందు కాంగ్రెస్ చచ్చిపోయిన పార్టీ. పాదయాత్రకు కూడా అనుమతి ఇవ్వలేదు. కాంగ్రెస్ ను నిలబెట్టింది వైఎస్అర్, రెండు సార్లు అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్ వల్లే. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిసినట్లే కాంగ్రెస్ వైఎస్ఆర్ కు వెన్నుపోటు పొడిచారు. చనిపోయిన తర్వాత అయన పేరును ఎఫ్ఐఆర్ లో పెట్టింది. లక్షల కోట్లు అప్పుచేసి ఎవరికైన మేలు చేసారా? నిరుద్యోగం, ఆత్మహత్యల విషయంలో తెలంగాణ అగ్రస్థానం లో ఉంది. కేసీఆర్ ప్రాణాలకు రక్షణ కావాలి కానీ, తెలంగాణ యువతకు రక్షణ వద్దా? చిన్నచిన్న పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్న కేసీఆర్ గుండె కరగడం లేదన్నారు.

తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చుతారని ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కెసిఆర్ వినియోగించుకోలేదు. నాకు జంపింగ్ జపాంగ్ లు అవసరం లేదు. నేను సింగిల్ గా ఉన్న ఎప్పుడు అధైర్యపడలేదు. ప్రజల కోసం కష్టపడే నాయకులూ కావాలి తప్ప రాజకీయాలు చేసేవాళ్ళు అవసరం లేదు. ఆస్తులు కాపాడుకోవడం కోసం పార్టీలోకి వచ్చేవాళ్ళు అవసరం లేదు. వైఎస్ఆర్ లెగసీని కంటిన్యూ చేయడానికే పార్టీ అని గుర్తు చేశారు. హుజురాబాద్ ఉపఎన్నిక పగలు ప్రతీకారం కోసం వచ్చిన ఎన్నిక మాత్రమే. ఈ ఎన్నిక అవసరమా? అర్థమేలేని ఎన్నిక మేము పోటీ చేయడం అవసరమా?

54 లక్షల మందికి ఉద్యోగాలు, దళితులకు మూడెకరాల భూమి ఇస్తే పోటీ చేస్తాం, గెలుస్తాం. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషనులు ఇస్తామని చెప్పి కనిసం 5 శాతానికి కూడా పెంచలేకపోయాడు. మైనారిటీల అభ్యున్నతికి వైఎస్ చేయనిది లేదు. వైఎస్ కంటే ఎక్కువే చేస్తా. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు టీఆరెస్ తో కుమ్మక్కైయ్యాయి. ఉద్యమకారుడిగా కేసీఆర్ అంటే అభిమానం ఉండేది మంచి చేస్తారనే భావించా. కానీ ఆయనలోని దొర బయటపడుతున్నారు. వైఎస్ సీఎం గా ఉన్నప్పుడు కష్టాలు చెప్పుకోవడానికి సామాన్యులకు సైతం అనుమతి ఉండేది. మంత్రులు, ప్రజాప్రతినిధులులైతే నేరుగా సీఎం ఆఫీస్ కి వెళ్లే వెసులుబాటు ఉండేది. సీఎం కెసిఆర్ అపాయింట్మెంట్ కోసం మంత్రులు, ఎమ్మెల్యేల గేట్ బయట నిలబడి బిక్షం ఎత్తుకుంటున్నారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article