వెంకటేశ్‌ కుటుంబాన్ని కలిసిన వైఎస్ షర్మిల

93

వైఎస్ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్ కు షాక్ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆమె రాజకీయ వేడిని రగిల్చారు. మెదక్ జిల్లాలోని వెల్దుర్తి మండలం శేరిల్లా గ్రామంలో బుధవారం ఉదయం పర్యటించారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం కోచింగ్‌ తీసుకొని, ఉద్యోగ నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్నా.. ఎంతకు నోటిఫికేషన్‌ రాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించారు. డీఎస్సి నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో వెంకటేష్ ఆత్మహత్య మే 16న ఆత్యహత్య చేసుకున్నాడు. వెంకటేశ్‌ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వారి కుటుంబానికి వైఎస్‌ షర్మిల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం వస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని అనుకున్నారు. కానీ, తెలంగాణ రాష్ట్రం వచ్చి ఏడేళ్లు గడిచినా ఉద్యమ లక్ష్యాలు దరిదాపుల్లో లేవన్నారు. నేడు తెలంగాణలో ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here