YS Vijayama Clarity on whether she was Contesting ?
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ కొడుకు కు మద్దతుగా మాట్లాడటం మొదలు పెట్టారు. గత ఎన్నికల్లో విశాఖపట్నం లోకసభ స్థానానికి పోటీ చేసి ఓటమిపాలైన విజయమ్మ అప్పటినుండి ఇప్పటివరకు పార్టీ కార్యకలాపాలకు దూరంగా నే ఉన్నారు కానీ ఇప్పుడు ఎన్నికల సమీపిస్తుంటే కుమారుడు విజయం కోసం ఆమె సైతం తన వంతు ప్రయత్నం చేయడం మొదలుపెట్టారు.
అందులో భాగంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి గారితో గతంలో సత్సంబంధాలు నెరపిన సీనియర్ కాంగ్రెస్ నాయకులను వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారు. జగన్ కు అండగా నిలవాలని, పార్టీలో చేరితే సముచిత స్థానం ఇస్తామని, మీ వంటి సీనియర్ల సహకారం జగన్ కు కావాలని ఆమె వారిని కోరుతున్నారు. అంతేనా వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసి పోటీ చేసిన జగన్ బాబు విజయం సాధించి తీర తాడని విజయమ్మ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ కీలకమైన ప్రకటన చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వైఎస్ విజయమ్మ చెప్పారు. తన కుమారుడు జగన్ అవసరమనుకుంటే మాత్రం ఎన్నికల్లో ప్రచారం చేస్తానని చెప్పారు. గత ఎన్నికల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఆమె పోటీ చెయ్యొద్దని నిర్ణయించుకున్నట్టు భావిస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో విశాఖపట్టణం నుండి పోటీ చేసి ఓటమిపాలైన విజయమ్మ చాలా కాలంగా ఆమె పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగానే ఉంటున్నారు. ఇక అన్న కోసం నేను సైతం అంటూ పాదయాత్ర చేసిన వైఎస్ షర్మిల కూడా పార్టీ కార్యాకలాపాల్లో కనిపించడం లేదు.
ఇక ఏపీ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదని, అందుకే జగన్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని విజయమ్మ చెప్పారు. ఇక అంతే కాదు వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి జగన్ సీఎం అవుతారని జోస్యం చెప్పారు . జగన్ కోడి కత్తి దాడి బాధ కల్పించింది అని ఇక ఈ దాడి విషయంలో కూడా అవహేళన చేయడం బాధ కలిగించిందని అన్నారు. ఎన్నికల్లో వైసిపి ఏకైక ఎజెండా ప్రత్యేక హోదా అని, ప్రత్యేక హోదా ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీకి తమ మద్దతు ఉంటుందని ఆమె చెప్పారు. ఇక జగన్ పాదయాత్రతో రాష్ట్ర రాజకీయాల్లో పెను పరిణామాలు చోటు చేసుకున్నాయని అభిప్రాయపడ్డారు. పాదయాత్ర ఎఫెక్ట్ ఓటు బ్యాంకు గా మారుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి ఒంటరిగానే పోటీ చేస్తుందని, తమ పార్టీకి 120 శాసనసభ స్థానాలు వస్తాయని విజయమ్మ జోస్యం చెప్పారు. వైఎస్ జగన్, షర్మిల పాదయాత్రల లక్ష్యం ఒక్కటేనని చెప్పారు. ఇక మొత్తానికి వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని కీలక ప్రకటించిన విజయమ్మ ఇంత కాలం తర్వాత మాట్లాడటం వెనుక కారణం ఏమై ఉంటుంది అని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.