`యాత్ర‌`కు విజ‌య‌మ్మ ప్ర‌శంస‌

YS VIJAYAMA PRAISES YATRA MOVIE
దివంగ‌త ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి రాజకీయ జీవితంలో ఆయ‌న చేసిన పాద‌యాత్ర‌కు ఎంతో ప్రాముఖ్య‌త ఉంది. దానిలోని కొన్ని ఘ‌ట్టాల‌ను ఆధారంగా చేసుకుని మ‌హి వి.రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ చిల్లా, శ‌శిదేవి రెడ్డి నిర్మించిన చిత్రం `యాత్ర‌`. మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మమ్ముట్టి వై.ఎస్‌.ఆర్ పాత్ర‌లో న‌టించారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ చిత్రాన్ని వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి స‌తీమ‌ణి వై.ఎస్‌.విజ‌య‌మ్మ వీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ “సినిమాను చాలా బాగా తీశారు. కోట్లాది మంది హృద‌యాల్లో ఉన్న రాజ‌శేఖ‌ర్‌రెడ్డిగారి జ్ఞాప‌కాల‌ను ఈ సినిమా ద్వారా త‌ట్టి లేపారు. ఆయ‌న స‌జీవంగా లేక‌పోయినా, ఈ సినిమా ద్వారా ఆయ‌న్ను మ‌న‌ముందుకు తీసుకువ‌చ్చారు. ఎన్ని అడ్డంకులు వ‌చ్చినా ఇచ్చిన మాట‌కు ఆయ‌న క‌ట్టుబ‌డ్డారు“ అన్నారు.

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article