జగ్గయ్యపేట:పట్టణం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వవిప్ జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సామినేని ఉదయభాను మాట్లాడుతూ వైయస్సార్ ఉచిత పంటల బీమా దేశానికే ఆదర్శం అని, ఏరువాకతో సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అండగా నిలిచారని, నిన్న ఒక్కరోజే 15.61 లక్షలమంది రైతన్నలకు 2,977.82 కోట్ల,అలాగే జగ్గయ్యపేట నియోజకవర్గ వ్యాప్తంగా 64 కోట్ల రూపాయల భీమా పరిహారాన్ని వారి ఖాతాలో జమ చేయడం జరిగిందని,రైతన్నలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని,అదేవిధంగా రైతన్నలకు మేలు చేసే విషయంలో దేశంతో పోటీ పడుతున్నామని,మన రాష్ట్రంలో జరుగుతున్న మార్పులను పక్కరాష్ట్రాలు సైతం వచ్చి చూస్తున్నారని,గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో 3,411 కోట్ల పంట బీమా మాత్రమే ఇచ్చారని,మన ప్రభుత్వ హయాంలో మూడేళ్లలోనే 6,685 కోట్ల రూపాయల భీమ చెల్లించామని, రైతులకు పెద్దఎత్తున అందిస్తున్న సంక్షేమ పథకాలతో రుణ ఎగవేతలు తగ్గినట్టు SLBC సమావేశంలో బ్యాంకర్లు చెప్పారని,అలాగే నియోజకవర్గంలో భీమా అందని వారు 1500 మంది ఉన్నారని వారికి కూడా RBK ద్వారా ప్రభుత్వంతో మాట్లాడి తప్పకుండా త్వరితగతిన భీమా వర్తించేలా చేస్తామని తెలియజేశారు.