వైసీపీ బీసీ శంఖారావం సభలో పాల్గొననున్న ఆర్ కృష్ణయ్య

YSRCP Focusing ON BC

రానున్న ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ప్రధాన పార్టీలు ఇప్పటికే కార్యచరణ మొదలుపెట్టాయి. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సమర శంఖారావం సభలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు జయహో బిసి సభ నిర్వహించిన నేపథ్యంలో ఆకట్టుకోవడానికి బీసీ శంఖారావం సభను నిర్వహించాలని నిర్ణయించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈనెల 17న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నిర్వహించబోయే బీసీ శంఖారావం సభకు బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య జై కొట్టారు. శనివారం వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో లోటస్ పాండ్ లో భేటీ అయిన ఆర్ కృష్ణయ్య పలు అంశాలపై చర్చించారు.
బీసీ సామాజిక వర్గం సమస్యలపైనే వైఎస్ జగన్ ను కలిసినట్లు తెలుస్తోంది. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ తో జగన్ కు 14 అంశాల లేఖను ఆర్.కృష్ణయ్య అందజేశారు. జాతీయ స్థాయిలో చట్టసభల్లో బీసీలకు ప్రత్యేక కోటా కల్పించాలని జగన్ ను కోరినట్లు తెలిపారు. ఈ అంశంపై రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాడుతుందని జగన్ హామీ ఇచ్చినట్లు కృష్ణయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఈనెల 17న తలపెట్టిన బీసీ శంఖారావం సభకు హాజరుకావాలని కోరినట్లు తెలిపారు. జగన్ ఆహ్వానం మేరకు తాను హాజరవుతానని స్పష్టం చేశారు.
అలాగే హాజరయ్యే అంశంపై బీసీ సంఘాల ప్రతినిధులతో మాట్లాడతానన్నారు. బీసీల కోసం ఏ పార్టీ సభలు పెట్టి పిలిచినా తాను హాజరవుతానని స్పష్టం చేశారు.ఈ సందర్భంలో బీసీల పక్షాన నిలబడాలని వారికి అండగా ఉండాలని జగన్ ను కోరినట్లు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. మొత్తానికి ఆర్ కృష్ణయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బి సి శంఖారావం సభలో పాల్గొనడం
తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్.

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article