వైసీపీ కి షాక్.. జనసేనలో చేరిన వైసీపీ కార్యకర్తలు

YSRCP LEADERS JOINED JANASENA

ఏపీ రాజకీయాలు రోజుకో రకంగా మారుతున్నాయి.  స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయ్యింది. ఇక ఈ నేపధ్యంలో ఏపీలో రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి భారీ షాక్ తగిలింది. విశాఖపట్నం జిల్లా గాజువాకకు చెందిన వైసీపీ నేతలు జనసేన పార్టీలో చేరారు. గాజువాక నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకుడు దల్లి గోవిందరెడ్డి ఆధ్వర్యంలో పలువురు యువకులు జనసేనలో చేరారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ వారికి కండువాలు పార్టీలోకి సాదరంగా  ఆహ్వానించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాల్సిన సమయం ఇదేనని, ఈ తరుణంలో ఇంత మంది యువకులతో కూడిన బృందం పార్టీలోకి చేరడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు.  ఒకవైపు అధికార వైసీపీ ఫుల్ జోష్ తో  ఉండి స్థానిక సంస్థల ఎన్నికలకు సై అంటుంటే మరోవైపు టీడీపీ డిఫరెంట్ స్ట్రాటజీలతో దూకుడు పెంచింది. ఇక ఇప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన ఎన్నికల్లో ముందడుగులు వేయడానికి సమాయత్తమవుతోంది.వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది కాలేదు. అప్పుడే ఆ పార్టీకి చెందిన గాజువాక వైసీపీ నేతలు జనసేనలో చేరడం తీవ్ర సంచలనంగా మారింది. సాక్షాత్తూ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. గత ఎన్నికల్లో జనసేనాని  భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పోటీ చేశారు. కానీ దురదృష్ణవశాత్తూ రెండూచోట్ల ఆయన ఓడిపోయారు. తాజాగా స్థానిక ఎన్నికలకు ముందు గాజువాకలో చేరికలు ఆ పార్టీకి మంచి బూస్ట్ అనే చెప్పాలి .

tags : YCP, Janasena, local body elections, gajuwaka , pawan kalyan , bheemavaram, party joinings,

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article