15 మంది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు కష్టమేనా?

YSRCP MLAS FACING TROUBLES

  • వారిపై జనంలో వ్యతిరేకత ఉందని సర్వేలో వెల్లడి

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో అక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రధాన పార్టీలు తమ గెలుపు ఓటములపై వరుసగా సర్వేలు చేయించుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీకి, ప్రతిపక్ష వైఎస్సార్ సీపీకి ఈ ఎన్నికలు అత్యంత కీలకంగానే మారడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకూడదని గట్టిగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి. చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలనలో ఆశించినంత అభివృద్ధి జరగకపోవడం, ఇన్నాళ్లూ మౌనంగా ఉండి సరిగ్గా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వివిధ వర్గాలపై వరాలజల్లు కురిపించడంపై జనాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఇక పాదయాత్ర, ప్రత్యేక హోదా ఉద్యమం ద్వారా నిరంతరం జనాల్లోనే ఉన్న వైఎస్సార్ సీపీ అధినేత జగన్ పట్ట జనంలో స్పందన బాగానే కనిపిస్తోంది. ఇటీవల వెలువడిన పలు సర్వే ఫలితాల్లో కూడా వైఎస్సార్ సీపీదే హవా అని తేలింది. అయితే,  వైఎస్సార్ సీపీ చేయించుకున్న సర్వేలో 15 మంది సిట్టింగుల పరిస్థితి కాస్త అనుమానంగా ఉందని తేలినట్టు సమాచారం. వీరిపై జనంలో అసంతృప్తి ఉన్నట్టు వెల్లడైంది. నియోజకవర్గ అభివృద్ధి నిధులను అధికార పార్టీ ఇవ్వకపోవడంతో ఆయా ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అభివృద్ధి కనిపించడంలేదు. అలాగే తమ అధినేత జగన్ జనంలో ఉన్న తరహాలో తాము ప్రజలతో మమేకం కావడంలో వారు విఫలమయ్యారు. ఇలాంటి కారణాల నేపథ్యంలోనే 15 మంది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల పరిస్థితి అనుమానంగా కనిపిస్తోంది. మరి వీరందరికీ జగన్ టికెట్లు ఇస్తారా ఇవ్వరా అనేది త్వరలోనే తేలనుంది.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article