దగ్గుపాటి చేరికపై భగ్గుమన్న వైసీపీ నేతలు

YSRCP politicians  fires Daggubati joining -జగన్ కు షాక్ …

ఏపీలో రాజకీయ పరిణామాలు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రసవత్తరంగా మారుతున్నాయి. కుమారుడి రాజకీయ భవితవ్యం కోసం దగ్గుపాటి కుటుంబం వైసీపీలో చేరడానికి సిద్ధమైన నేపథ్యంలో పార్టీలో చిచ్చు రగులుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఎవరు చేరిక జరిగినా సరే కచ్చితంగా ఏదో ఒక గొడవవుతుంది. ఇక తాజాగా దగ్గుపాటి కుటుంబం వైసిపి లోకి అడుగు పెడుతుందో లేదో రెండో రోజు గొడవ మొదలైంది. దగ్గుపాటి ఆ పార్టీలో చేరడాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని అవకాశవాద రాజకీయాలు చేసే వారిని పార్టీలో చేర్చుకోవడం తో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దగ్గుపాటి చేరిక కు వ్యతిరేకంగా పరుచూరు వైసిపి కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఇక ఈ సమావేశంలో దగ్గుపాటి ని పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వడంపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. వైసిపి కార్యకర్తలు పర్చూరు నియోజకవర్గంలో పనిచేసిన నాయకులను పక్కన పెట్టిదగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్‌ చెంచురాంకు పర్చూరు టికెట్ ఇవ్వడం తగదని నేతలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు.
పార్టీని నమ్ముకున్నవారికి అన్యాయం చేస్తే సహించబోమని వైసీపీ నేతలు అల్టీమేటం జారీ చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉంటది అంటే ఆ పార్టీలో చేరి అవకాశవాద రాజకీయం చేయడం, అధికారంలోకి వచ్చే పార్టీలో చేరడం దగ్గుబాటి వెంకటేశ్వరరావు నైజమని వారు మండిపడ్డారు. ఇక ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టించే తత్వం దగ్గుపాటిదని వైసీపీ నేతలు ధ్వజమెత్తారు. దీంతో ఇప్పుడు జగన్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పార్టీ శ్రేణులు దగ్గుపాటి చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో , మరోపక్క పురంధరేశ్వరి కూడా బీజేపీని వీడి వైసిపికి రానని చెప్పిన కారణంగా జగన్ సైతం యూటర్న్ తీసుకునే అవకాశం లేకపోలేదు. హైదరాబాద్లోని లోటస్‌ పాండ్‌లో వైసీపీ అధినేత జగన్‌ను కలిసిన దగ్గుపాటి హితేష్ చెంచు రామ్ కు పర్చూరు నియోజకవర్గ టిక్కెట్ ఇవ్వాలని కోరగా హితేష్ కు ఉన్న పౌరసత్వ సమస్యను పరిష్కరించుకునే రావాల్సిందిగా జగన్ సూచించారు. హితేష్ పోటీకి ఇబ్బంది ఎదురయ్యే క్రమంలో దగ్గుపాటి నేరుగా బరిలోకి దిగనున్నారు. ఇది జగన్ సమక్షంలో జరిగిన చర్చ. అయితే ఎప్పుడైతే దగ్గుపాటి వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారో పర్చూరు అసెంబ్లీ వైకాపా నేతలు సమావేశమై దగ్గుబాటి కుటుంబానికి టిక్కెట్ ఇస్తే ఊరుకునేది లేదంటూ వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పార్టీ లో పనిచేస్తున్న వారికి అన్యాయం చేయొద్దని అధినేతకు విజ్ఞప్తి చేసిన నాయకులు దగ్గుబాటి కుటుంబానికి టిక్కెట్ ఇస్తే తిరుగుబాటు తప్పదని అల్టిమేటం జారీ చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article