ఏపీలో వైఎస్సార్ సీపీ ప్రభంజనం ఖాయం

YSRCP WILL WIN IN AP

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజానాడి పట్టుకునేందుకు పలు సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. ఇవీ మా అంచనాలు అంటూ ఫలితాలు కూడా విడుదల చేస్తున్నాయ్. ఇప్పటివరకు వచ్చిన దాదాపు అన్ని సర్వేల్లోనూ అధికార తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభవం తప్పదని తేలింది. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయభేరి మోగించడం తథ్యమని వెల్లడైంది. తాజాగా వీడీపీ అసోసియేట్స్ నిర్వహించిన మరో అధ్యయనంలో కూడా ఇదే ఫలితం వచ్చింది. ఏపీలోని మొత్తం 25 లోక్ సభ స్థానాల్లో జగన్ పార్టీకి 21 సీట్లు వస్తాయని, టీడీపీ 4 స్థానాలతో సరిపెట్టుకుంటుందని పేర్కొంది. జనసేనకు సీట్లు రాకపోయినా, తెలుగుదేశం పార్టీ ఓటమికి కారణమవుతుందని సర్వే విశ్లేషించింది. ఇక ఓట్ల శాతానికి వస్తే వైఎస్సార్ సీపీ 45 శాతం ఓట్లను సాధిస్తుందని, టీడీపీకి 37.2 శాతం ఓట్లు వస్తాయని వివరించింది. ఇక బీజేపీ 7.1 శాతం ఓట్లను, జనసేన 5.9 శాతం ఓట్లు తెచ్చుకుంటాయని, కాంగ్రెస్ కేవలం 2.2 శాతం ఓట్లు మాత్రం సాధిస్తుందని సర్వే స్పష్టంచేసింది. ఇదే సరళి అసెంబ్లీలోనూ కొనసాగితే వైఎస్సార్ సీపీ 130 సీట్లు అధికారం కైవసం చేసుకుంటుందని వెల్లడించింది.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article