Thursday, November 14, 2024

అంతా మీ ఇష్ట‌మా..?

నోటీసులు ఇవ్వ‌కుండా ఎలా కూలుస్తారు
ఆయా రాష్ట్రాల్లో బుల్డోజ‌ర్ల పాల‌న‌పై ఆగ్ర‌హం
కూల్చివేతలపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ‌లోని హైడ్రా, యూపీలోని బుల్డోజ‌ర్ల పాల‌న‌పై దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం షాక్ ఇచ్చింది. కూల్చివేతలపై కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయబద్దమైన నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టొద్దని స్పష్టం చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు తీర్పును పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది.
కూల్చివేత‌ల‌పై ప్ర‌యాప్ర‌యోజ‌నాల వాజ్యం కింద దాఖ‌లైన పిటిష‌న్‌ను సుప్రీం కోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించింది. ఈ సంద‌ర్భంగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు అత్యున్నత ధర్మాసనం వార్నింగ్ ఇచ్చింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై బుల్డోజర్‌లను ప్రయోగించడాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది. న్యాయబద్దమైన నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టొద్దని స్పష్టం చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు తీర్పును పాలించాల్సిందే అని తేల్చి చెప్పింది. నిందితులను దోషులు నిర్ధారించొద్దని పేర్కొంది. విచారణ పూర్తికాకుండానే నిందితులను దోషిగా పరిగణించలేం అని అభిప్రాయపడింది. దోషిగా నిర్ధారించిన చట్ట ప్రకారమే శిక్ష ఉండాలని తెలిపింది. నిందితుల ఇళ్లను బుల్డోజర్‌తో కూల్చడం చట్ట విరుద్ధం అని చెప్పింది. ఇళ్లను కూల్చడం అంటే నివసించే హక్కును కాలరాయడమే అని స్పష్టం చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular